తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: తుది ఓటర్ల జాబితా విడుదల..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2026 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీ తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. తాజా జాబితా ప్రకారం.. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 52,43,023 మంది … Read more

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (GGH) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను లోపల, బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ఓపీ, స్కానింగ్ విభాగాలను పరిశీలించి, వైద్యులు, … Read more

ఆన్‌లైన్ బెట్టింగ్ మోజు.. చివరికి దొంగగా మార్చింది!

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ/కేతేపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు (Online Betting) బానిసైతే జీవితాలు ఎలా నాశనమవుతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈజీ మనీ కోసం అలవాటు పడి, జైలుకు వెళ్లొచ్చినా బుద్ధి మార్చుకోని ఓ పాత నేరస్తుడు.. మళ్లీ దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. పత్తి లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన కేసులో ఇద్దరు నిందితులను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది? కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన మహేష్ ఈ నెల … Read more

సరిగా లేని వోటర్ వివరాలతో ఎన్నికలా?

మన పత్రిక వెబ్​డెస్క్, షాద్‌నగర్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలకు పైగా గడిచింది. ఇస్రో ద్వారా భారత్ అంగారకుడు(మార్స్) చేరుకున్నది, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయినప్పటికీ, ప్రాథమిక ఎన్నికల సేవల విషయంలో పౌరులు ఇప్పటికీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుండటం అత్యంత ఆందోళనకరం. వోటర్ ఐడీలలో తప్పు పేర్లు నమోదు కావడం, వోటర్ ఐడీని ఆధార్‌తో లింక్ చేయడంలో సమస్యలు, ప్రస్తుత నివాస చిరునామా ఆధారంగా తప్పు వార్డు కేటాయింపులు జరగడం, … Read more

TG News: ఉద్యోగులకు డీఏ మంజూరు.. జిల్లాల మార్పుపై కమిషన్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA) ఫైలుపై సంతకం చేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల స్వరూపం మారబోతోందంటూ మరో కీలక ప్రకటన చేశారు. టీజీవో (TGO) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ సంచలన విషయాలను వెల్లడించారు. ఉద్యోగులకు వరాలు – డీఏ మంజూరు ఉద్యోగులకు మంచి … Read more

తల్లిదండ్రులని చూడకపోతే జీతంలో కోత: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం – 15% కట్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని గాలికి వదిలేస్తున్న వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరిక జారీ చేశారు. తల్లిదండ్రుల బాగోగులు చూడని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అవసరమైతే వారి జీతాల్లో కోత విధించి, ఆ డబ్బును నేరుగా తల్లిదండ్రులకే అందేలా చేస్తామని సంచలన ప్రకటన చేశారు. జీతంలో 15 శాతం కట్! బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్ల ప్రారంభోత్సవం … Read more

పెండింగ్ బిల్లులపై సర్కార్‌కు డెడ్‌లైన్..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: Telangana Pending Bills.. రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లుల వ్యవహారం మరోసారి వేడెక్కింది. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ జాప్యంపై ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్నే హెచ్చరిస్తూ సంచలన ప్రకటన చేశారు. మార్చి 1వ తేదీలోగా సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమ బాట పడతామని అల్టిమేటం జారీ చేశారు. మార్చి 2 నుంచి దీక్ష ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మార్చి 1వ తేదీలోగా క్లియర్ చేయాలని వెంకట్రామిరెడ్డి … Read more

జర్నలిస్టులకు గుడ్ న్యూస్: ఈసారి ఎక్కువగానే అక్రిడిటేషన్ కార్డులు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య తగ్గుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన సుమారు 23 వేల కార్డుల కంటే.. ఈసారి ఎక్కువగానే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం సచివాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. … Read more

ఖమ్మం కలెక్టర్ అనుదీప్‌కు అరుదైన గౌరవం..

మన పత్రిక వెబ్​డెస్క్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టర్ (Khammam collector) , యువ ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టిని అరుదైన గౌరవం వరించింది. విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలాని (BITS Pilani) అందజేసే ‘యంగ్ అలుమ్ని అచీవ్ మెంట్ అవార్డు – 2026’కు ఆయన ఎంపికయ్యారు. మంత్రి చేతుల మీదుగా.. శనివారం హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని క్యాంపస్‌లో జరిగిన గ్లోబల్ మీట్ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు … Read more

TG FSL Recruitment: జనవరి 20 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ (TG FSL)లో 60 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) తదుపరి దశ అయిన ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) షెడ్యూల్‌ను ప్రకటించింది. తేదీలు – వేదిక వివరాలు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంటిమేషన్ లెటర్స్ డౌన్లోడ్ ఇలా.. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యేందుకు … Read more