మేడారంలో పెంపుడు కుక్కకు తులాభారం.. హీరోయిన్ తీరుపై భక్తుల ఫైర్.. చివరకు సారీ!

మన పత్రిక వెబ్​డెస్క్, ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ నటి టీనా శ్రావ్య చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా భక్తులు తమ బరువుకు సరిపడా బంగారాన్ని (బెల్లం) అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. దీనిని తులాభారం అంటారు. అయితే, హీరోయిన్ టీనా శ్రావ్య ఏకంగా తన పెంపుడు కుక్కకు తులాభారం వేయించి అమ్మవార్లకు బంగారం సమర్పించడం … Read more

Nalgonda: రూ.11.38 కోట్ల రుణాలు పంపిణీ..

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. … Read more

TG News : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతలు.. 

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు వ్యూహ రచన చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు, సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఎవరికి ఏ బాధ్యత? మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన ఇంచార్జీల … Read more

హైదరాబాద్ లో 54 మంది సీఐల బదిలీ.. ఉత్తర్వులు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: నగర పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 54 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను (CI) బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ ల బదిలీలు జరిగిన నేపథ్యంలో తాజాగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సీసీఎస్ సైబర్ క్రైమ్స్ విభాగం నుంచి భారీగా బదిలీలు జరిగాయి. బదిలీ అయిన వారిలో 26 మంది … Read more

నర్సింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్: జపనీస్, జర్మన్ భాషల్లో శిక్షణ..

మన పత్రిక వెబ్​డెస్క్, ఖమ్మం: తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఏదులాపురంలో పర్యటించిన ఆయన.. దాదాపు రూ.362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారికి జపనీస్, జర్మన్ భాషలు నేర్చుకునేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోందని వెల్లడించారు. ఇంజనీరింగ్ కంటే నర్సింగ్‌కే డిమాండ్ … Read more

Sircilla Municipality Elections: సిరిసిల్ల మున్సిపల్ పీఠం జనరల్ మహిళకు.. బీసీలకు నిరాశేనా?

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ పీఠం రిజర్వేషన్ మార్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ స్థానాన్ని ‘జనరల్ మహిళ’ (General Women) కేటగిరీకి కేటాయించడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ బీసీ (పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన నేతలే ఏకచక్రాధిపత్యం వహిస్తూ వచ్చారు. అయితే, చుట్టుపక్కల గ్రామాల విలీనం, తాజా రిజర్వేషన్ మార్పుతో పీఠం బీసీల చేజారిపోతుందా? అనే ఆందోళన ఆ వర్గంలో … Read more

మెదక్‌లో కలకలం: కాళ్లకు ‘జీపీఎస్’తో రాబందు.. జనం భయం

మన పత్రిక వెబ్​డెస్క్, మెదక్: జిల్లాలోని అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామంలో ఆదివారం ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని పొలాల్లో సంచరిస్తున్న ఒక రాబందును చూసి స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ పక్షి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్ (GPS Tracker), స్టిక్కర్లు, నంబర్లు ఉండటంతో ఇది ఏదో గూఢచారి పక్షి అయి ఉంటుందని, లేదా గ్రామానికి ఏదో కీడు జరుగుతుందని జనం భయపడ్డారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ … Read more

ఏం ఆశించి.. ఎవరి కోసం రాశారు?’.. ఆ పత్రిక కథనంపై భట్టి విక్రమార్క సీరియస్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికో, అధికారాన్ని అనుభవించడానికో తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్తులను దోచుకునే బందిపోట్ల నుంచి తెలంగాణ వనరులను రక్షించి, ప్రజలకు పంచడమే తన లక్ష్యమని తేల్చిచెప్పారు. ఆరోపణలు వస్తే రద్దు చేయమన్నా.. సింగరేణి బొగ్గు సంస్థ … Read more

TG TET Results 2026: టెట్ ఫలితాలు.. చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇదే

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ టెట్ (TG TET) – 2026 పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తారు. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TG TET-2026 ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య విడుదల కానున్నాయి. ఈసారి పేపర్‌-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 71,670 మంది … Read more

సిరిసిల్ల టీచర్స్ క్రికెట్ టోర్నీ.. విజేతగా కోనరావుపేట జట్టు

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: మండల విద్యాధికారి మంకు రాజయ్య స్మారకార్థం నిర్వహించిన ‘టీచర్స్ ప్రీమీయర్ లీగ్’ (TPL) జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో జిల్లాలోని ఆరు జట్లు తలపడగా, ఫైనల్ లో సిరిసిల్ల జట్టుపై గెలిచిన కోనరావుపేట టీమ్ విజేతగా నిలిచింది. సిరిసిల్ల జట్టు రన్నరప్ గా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే విజేతలకు కప్ ను అందించి … Read more