Ramoji Group Foundation Day : రామోజీ గ్రూప్ ఫౌండేషన్ డే వేడుకలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

Eenadu md kiran invites cm revanth for ramoji foundation day celebrations

Ramoji Group Foundation Day : రామోజీ గ్రూప్ ఫౌండేషన్ డే వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈనెల 16న ఈ వేడుకలు రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించబడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ ను రామోజీ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ సీహెచ్ కిరణ్ కలిశాను. ఈసందర్భంగా సీఎం రేవంత్ ను వేడుకలకు హాజరు కావాలని కిరణ్ ఆహ్వానించారు.

Chevella Road : చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని దర్నా.. 25 మందిపై కేసు నమోదు

case registered on people for dharna demanding repair of chevella road

Chevella Road : చేవెళ్ల రోడ్డు మీద రోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా… ఆ రోడ్డు మాత్రం బాగుపడటం లేదు. ఇటీవల జరిగిన చేవెళ్ల రోడ్డు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అందుకే చేవెళ్ల రోడ్డును బాగు చేయాలని కొందరు యువకులు రోడ్డుపై బైఠాయించారు. ధర్నా చేశారు. దీంతో ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించి, అనుమతి లేకుండా ధర్నా చేశారని 25 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Chevella Bus Accident : ముగ్గురు కూతుళ్లకు కలిపి 21 లక్షల చెక్ తండ్రి ఎల్లయ్యకు అందజేత

compensation to 3 sisters who died in chevella bus accident

Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేసింది. చేవెళ్ల ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా ముగ్గురు అక్కచెల్లెళ్లకు గాను చొక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.21 లక్షల చెక్కను తండ్రి ఎల్లయ్య గౌడ్ కు ప్రభుత్వం తరుపున అధికారులు అందజేశారు. నష్టపరిహారం అందుకుంటూ తండ్రి ఎల్లయ్య గౌడ్ తీవ్ర కంటతడి పెట్టాడు. నా ముగ్గురు … Read more

Snake Bit in Jagityal : నెల రోజుల్లో ఓ వ్యక్తిని ఏడుసార్లు కరిచిన పాము

snake bit a man seven times in one month

Snake Bit in Jagityal : ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఓ వ్యక్తిని ఓ పాము నెల రోజుల వ్యవధిలో ఏడు సార్లు కాటేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని గత నెలలో ఓ పాము కరిచింది. వెంటనే ఆ యువకుడు ఆసుపత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరోసారి అదే పాము కాటేసింది. దీంతో మరోసారి … Read more

గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణి సస్పెండ్..

నల్గొండ జిల్లా దేవరకొండ ( Devarakonda) ఎస్టీ బాలికల గురుకుల (ST Gurukula) పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. పదవ తరగతి విద్యార్థిని మాధవి ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో ప్రిన్సిపల్ కళ్యాణిని ఆదివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినిపై ప్రిన్సిపల్ కళ్యాణి, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, అమృతలు వేధింపులు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తల్లి కళ మీడియా ఎదుట వాపోయింది. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్, … Read more

Lok Adalat: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

Lok Adalat nizamabad november 15

మన పత్రిక, వెబ్​డెస్క్: జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి జడ్జి భరతలక్ష్మి (GVN Bharathalakshmi) విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 1,328 క్రిమినల్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జడ్జి భరతలక్ష్మి మాట్లాడుతూ, విభేదాలు వచ్చినప్పుడు రాజీ పద్ధతిలో ముందుకు రావడమే … Read more

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?

Telangana highcourt questions govt over local body elections

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 24 లోపు ఎన్నికల తేదీని ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 243 ఈ ఆర్టికల్ ప్రకారం పంచాయతీల కాల పరిమితి పూర్తయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రమే అభ్యంతరం తెలిపామని, ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు … Read more

Bus Accidents : నిన్న చేవెళ్ల.. ఇవాళ నల్గొండ, కరీంనగర్‌లో బస్సుల ప్రమాదాలు

two bus accidents in Nalgonda and karimnagar

Bus Accidents : చేవెళ్లలో నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ ను మరవక ముందే తెలంగాణలో మరో రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి దగ్గర ఇవాళ ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను మెట్ పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు … Read more

Chevella Accident : రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

mallu ravi response on chevella bus accident

Chevella Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? ఎందుకు దానికి ఇంత రాద్దాంతం చేస్తున్నారు అంటూ స్పష్టం చేశారు. రెగ్యులర్ గా జరిగిన యాక్సిడెంట్ మాత్రమే ఇది. రోడ్డు బాగాలేక జరిగింది కాదు.. గత ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు జరగలేదా? రోడ్డు బాగున్న హైవేల మీద యాక్సిడెంట్స్ జరగడం లేదా అని మల్లు రవి ప్రశ్నించారు. చేవెళ్ల యాక్సిడెంట్ … Read more

chevella: 21 మంది మృతి.. 3 నెలల చిన్నారి సహా!

chevella news

మన పత్రిక, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో 21 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మృతుల్లో మూడు నెలల చిన్నారి పాప, ఆమె తల్లి కూడా ఉండటం తీవ్రంగా కలిచివేసింది. రోడ్డు పక్కన తల్లి, బిడ్డ మృతదేహాలు ఉన్న దృశ్యం అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఇదే ప్రమాదంలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు … Read more