మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలంగాణ టెట్ (TG TET) – 2026 పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తారు. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TG TET-2026 ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య విడుదల కానున్నాయి. ఈసారి పేపర్-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 71,670 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. పరీక్షల కోసం 18 జిల్లాల్లో 97 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ స్కోర్‌ను అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు:
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/tgtet/ సందర్శించండి.
- హోం పేజీలో “TG TET January – 2026 Results” లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్, పేపర్ కోడ్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
- ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయగానే మీ టెట్ స్కోర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ కాపీని డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోండి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
