మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు వ్యూహ రచన చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు, సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించింది.
ఎవరికి ఏ బాధ్యత? మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన ఇంచార్జీల వివరాలు ఇలా ఉన్నాయి:
Advertisement
- నల్గొండ: అట్లూరి లక్ష్మణ్
- భువనగిరి: సీతక్క (ధనసరి అనసూయ)
- ఆదిలాబాద్: టి. సుదర్శన్ రెడ్డి
- మల్కాజిగిరి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- చేవెళ్ల: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- మెదక్: గడ్డం వివేక్ వెంకటస్వామి
- ఖమ్మం: కొండ సురేఖ
- మహబూబాబాద్: పొన్నం ప్రభాకర్
- మహబూబ్‌నగర్: దామోదర రాజనర్సింహ
- జహీరాబాద్: మహమ్మద్ అజారుద్దీన్
- నాగర్ కర్నూల్: వాకిటి శ్రీహరి
- నిజామాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వరంగల్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- కరీంనగర్: తుమ్మల నాగేశ్వరరావు
- పెద్దపల్లి: జూపల్లి కృష్ణారావు
ఈ నాయకులు తమకు కేటాయించిన పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లో పార్టీ విజయం కోసం సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు వీరిదే బాధ్యత అని అధిష్టానం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
