మన పత్రిక వెబ్‌డెస్క్, గుర్రంపోడు: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల నూతన తహశీల్దార్‌గా ఎన్. కరుణ శ్రీ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన తహశీల్దార్ పి. శ్రీనివాస్ మిర్యాలగూడకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుమలగిరి (సాగర్) నుంచి బదిలీపై వచ్చిన కరుణ శ్రీ నూతన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల పరిధిలోని భూ సంబంధిత, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు సత్వర సేవలందించేందుకు సిబ్బంది అందరూ సమన్వయంతో సహకరించాలని, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం తహశీల్దార్ కరుణ శ్రీకి కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు నజీర్, హాకీం, సర్వేయర్ రాంనర్సయ్య, ఏఎస్ సాలయ్య, జూనియర్ అసిస్టెంట్లు సందీప్, గోవర్ధన్, యాదగిరి, రామక్రిష్ణ, శ్రీనివాస్, రాంరెడ్డి, జీపీఓల మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎఫ్ఏఎస్ నరేష్, కంప్యూటర్ ఆపరేటర్ శివ, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొని కొత్త తహశీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
