Heavy Rains | భారీ వర్షం.. జలమయమైన నగరం, తడిసిన ధాన్యం!

Heavy Rains

మన పత్రిక, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) ఆదివారం సాయంత్రం భారీ వర్షం (Heavy Rains) దంచికొట్టింది. అకస్మాత్తుగా కురిసిన వానకు నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రైల్వేస్టేషన్ వద్ద డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, ఈ అకాల వర్షం అన్నదాతలను ఆయోమయంలో పడేసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయింది. టార్పాలిన్లు కప్పినప్పటికీ ధాన్యంలోకి నీళ్లు చేరాయి. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షపు … Read more

Telangana Bandh: కాలేజీల బంద్.. ₹900 కోట్లు బకాయిలు!

Telangana bandh november 3

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు (Telangana bandh november 3) నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తక్షణమే రూ. 900 కోట్లు విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHI) డిమాండ్ చేసింది. బకాయిల కారణంగా సిబ్బందికి జీతాలు, బిల్లులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ బంద్‌కు ఫ్యాకల్టీ … Read more

టీచర్ల సర్దుబాటు పూర్తి కాలేదు.. డీఈఓలకు డైరెక్టర్ కీలక ఆదేశాలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయుల ( Telangana Teachers ) సర్దుబాటు ప్రక్రియపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ( DEO Naveen Nicolas ) అక్టోబర్ 30న కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మిగులు (Surplus) ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేసే ప్రక్రియ పూర్తయినట్లు డీఈఓలు నివేదించినా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్ నివేదికల ప్రకారం, జిల్లాల్లో మిగులు టీచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని … Read more

TGPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్లు విడుదల! 8 నుంచి పరీక్షలు.

TGPSC DEPARTMENT TESTS HALL TICKETS NOVEMBER 2025

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. డిపార్ట్మెంట్ల టెస్ట్ 2025 నవంబర్ సెషన్‌కు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక లింకు ద్వారా నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TGPSC DEPARTMENT TESTS HALL TICKETS NOVEMBER 2025 ఈ పరీక్షలను నవంబర్ 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ ఇదివరకే ప్రకటించింది. పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ … Read more

Hyderabad: మియాపూర్‌లో 5 అంతస్తుల భవనం కూల్చివేత.. హైడ్రా చర్యలు!

Hyderabad hydra news

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, నకిలీ రికార్డులతో నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, మియాపూర్‌లోని సర్వే నంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు విచారణలో గుర్తించారు. ఆక్రమణదారులు ఏకంగా హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన కంచెను తొలగించి, సర్వే నంబర్ 100లోనే 307, 308 పేర్లతో దొంగ రికార్డులు సృష్టించారు. ఈ నకిలీ పత్రాలను అడ్డుపెట్టుకుని ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు … Read more

Sangareddy: హెచ్‌ఎం రేఖ రాణి సస్పెండ్.. ఎస్ఏ-1 పరీక్షల ఉల్లంఘన!

Sangareddy news hm suspended

మన పత్రిక, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దెగుల్ వాడి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ రాణిని జిల్లా విద్యాధికారి (DEO) వెంకటేశ్వర్లు సస్పెండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం పాఠశాలను తనిఖీ చేసిన మండల విద్యాధికారి (MEO) రహీమొద్దీన్, విద్యాశాఖ ప్రకటించిన సమగ్ర మూల్యాంకనం (ఎస్ఏ-1) పరీక్షల షెడ్యూల్‌ను ఆమె ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఎంఈఓ జిల్లా విద్యాధికారికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా … Read more

TG News: నేటి నుంచి నవంబర్ రేషన్.. 17,102 టన్నుల సన్న బియ్యం!

hyderabad november ration rice distribution starts today 17102 tons

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లో నవంబరు నెలకు సంబంధించిన రేషన్‌ బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బియ్యం స్టాకును ఇప్పటికే రేషన్‌ షాపులకు తరలించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లా పరిధిలో మొత్తం 7,98,269 రేషన్‌కార్డులు ఉండగా, 30,42,056 మంది లబ్దిదారులు ఉన్నారు. నవంబర్ నెలకు గాను 17,102 టన్నుల సన్న బియ్యాన్ని కేటాయించారు. మొదటి విడతగా 8,500 టన్నుల బియ్యాన్ని నగరంలోని 653 రేషన్‌ … Read more

Telangana: ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవి

Telangana

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పలు కీలక పదవులను భర్తీ చేసింది. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును నియమించింది. అదేవిధంగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. మంత్రి పదవి ఆశించిన ఈ ఇద్దరు నేతలకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుదర్శన్ రెడ్డికి 6 గ్యారంటీల అమలు బాధ్యతను కూడా అదనంగా అప్పగించారు. ఆయన కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరించనున్నారు. మంత్రులకు వర్తించే అన్ని … Read more

Mahabubabad: బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం!

mahabubabad news

మన పత్రిక, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం వేశారు. బాధితుడు చిన్నగూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజుగా గుర్తించారు. గుర్తు తెలియని శవమని భావించిన సిబ్బంది, రాజును రాత్రంతా మార్చురీలోనే ఉంచారు. ఉదయం ఓ స్వీపర్ గమనించి, రాజు బతికే ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని బయటకు తీసి తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఆధార్ కార్డు … Read more

TG News: గ్రూప్-2 విజేతలకు కొలువులు.. నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్!

miryalaguda news

మన పత్రిక, మిర్యాలగూడ: తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో అసిస్టెంట్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారులుగా (ఏబీసీడీఓ) ఎంపికైన 16 మందికి శుక్రవారం సెక్రటేరియట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని సత్కరించి, అభినందనలు తెలిపారు. నూతన ఉద్యోగ ప్రయాణంలో భాగంగా, బీసీ సంక్షేమ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విధుల్లో నిబద్ధత, నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని ఆయన … Read more