మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పలు కీలక పదవులను భర్తీ చేసింది. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును నియమించింది. అదేవిధంగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.
మంత్రి పదవి ఆశించిన ఈ ఇద్దరు నేతలకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుదర్శన్ రెడ్డికి 6 గ్యారంటీల అమలు బాధ్యతను కూడా అదనంగా అప్పగించారు. ఆయన కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరించనున్నారు. మంత్రులకు వర్తించే అన్ని సదుపాయాలను వీరికి కల్పిస్తూ ప్రభుత్వం జీవో (GO) జారీ చేసింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
