రూ.225 కోట్లతో బాసర ఆలయ పునరభివృద్ధి.. సీఎం రేవంత్ శంకుస్థాపన

మన పత్రిక, నిర్మల్: తెలంగాణలోని బాసరలో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయ పునరభివృద్ధి పనులకు సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.225 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు. ఆగమ శాస్త్ర నిబంధనలు, … Read more

ఈ నెలాఖరులోగా మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

మన పత్రిక, మిర్యాలగూడ: పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం వారు ఈ గృహ సముదాయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలి ఉన్న మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, ప్లంబింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో, వసతులు కల్పించడంలో ఎటువంటి … Read more

గజ్వేల్‌ బంద్‌.. BRS ఆధ్వర్యంలో నిరసన

మన పత్రిక, తెలంగాణ: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ‘గజ్వేల్ బంద్’ ఉదయం నుంచే ఉధృతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్‌లో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున బస్సులు బయటకు … Read more

శిలలతో రూపుదిద్దుకోనున్న బాసర ముగ్గురమ్మల ఆలయం!

మన పత్రిక, తెలంగాణ: అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన బాసర క్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రూ.225 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భూమిపూజ చేయనున్నారు. దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది తీరాన వెలసిన ఈ క్షేత్రం అక్షరాభ్యాసాలకు కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి వంటి పర్వదినాల్లో వేలాదిమంది చిన్నారులు … Read more

తెలంగాణ: పెరగనున్న మద్యం, బీర్ల ధరలు..?

మన పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన మార్పులు మద్యం ధరల పెంపుకు దారితీస్తున్నాయి. ఈ వేసవిలో మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిసారిగా 2023 మేలో ధరలు పెంచగా, నిబంధనల ప్రకారం 2025 మేలో మళ్లీ సమీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ గడువు … Read more

AP, TGలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎంతంటే..?

మన పత్రిక: దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరణకు లోనవుతుంటాయి. అయితే ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం ప్రభావంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుతో వినియోగదారులపై భారం పెరిగింది. ఏప్రిల్ 1న గ్యాస్ ధరలు తగ్గుతాయనే ఆశతో ఎదురుచూసిన వినియోగదారులకు నిరాశ ఎదురైంది. గృహవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం … Read more

ఆదిలాబాద్: CM వస్తుండు.. వరాలు కురిపించేనా..?

మన పత్రిక, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బజార్‌హట్‌నూర్ మండలం పిప్పిరి గ్రామంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానుండటంతో కొత్త ప్రకటనలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన కీలకంగా మారింది. జిల్లాలో ప్రధాన సమస్యలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ప్రవహించే పెన్‌గంగా … Read more

ఆదిలాబాద్ జిల్లాకు సీఎం.. 900 మంది పోలీసులతో బందోబస్తు

మన పత్రిక, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం పిప్రి గ్రామంలో జరగనున్న బహిరంగ సభకు అనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 900 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో సభ నిర్వహించేందుకు ప్రత్యేక … Read more

ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం

మన పత్రిక: నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో జరిగిన ఈ ఎన్నికలో అంకం మౌనిక చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలిచాయి. స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో కాంగ్రెస్ బలం నాలుగుకు చేరింది. దీంతో … Read more

అర్ధరాత్రి తెలంగాణలోని పలు జిల్లాలో వర్షం

మన పత్రిక: తెలంగాణలో శనివారం అర్థరాత్రి వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షాలు కురిసి పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణలోని కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ నగర పరిధిలోనూ వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా నార్త్ హైదరాబాద్ ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లులు కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పలుచోట్ల వర్షం పడడంతో రోడ్లపై నీరు నిలిచింది. … Read more