చిల్లపల్లి సర్పంచ్ గెలిచిన వెంటనే నీటి సమస్య పరిష్కారం..

చిల్లపల్లి సర్పంచ్‌గా భారీ మెజారిటీతో విజయం సాధించిన యువ నాయకుడు గోపు సంతోష్ కుమార్, గెలిచిన వెంటనే తన పనితీరుతో ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఆయన, ప్రజలకు ఇచ్చిన మాటను చేతల్లో చేసి చూపిస్తున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న బోరు గత కొద్ది రోజులుగా పనిచేయకపోవడంతో స్థానికులు, విద్యార్థులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ సంతోష్ కుమార్ వెంటనే … Read more

ధర్మపురి ఆలయాల్లో చోరీ.. వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు

జగిత్యాల జిల్లా ధర్మపురిలో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఉన్న శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం నిత్య పూజల కోసం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన అర్చకులు, తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని వెండి ప్రాణ వట్టం, అమ్మవారి వెండి ముఖ కవచాన్ని … Read more

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి చంపిన భర్త

హైదరాబాద్‌లోని నల్లకుంటలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కిరాతక భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు ఘటన జరిగిన 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో వెంకటేష్ వేధించేవాడు. గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిన త్రివేణిని నమ్మించి నగరానికి … Read more

ఆ ఇద్దరు మంత్రులు జైలుకే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మన పత్రిక, వెబ్​డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు భారీగా అవినీతికి పాల్పడ్డారని, ఆధారాలతో సహా కేంద్రం వద్ద వారి చిట్టా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా వారిపై ఉందని, ఆ ఇద్దరు మంత్రులు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కూడా సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్‌ను బూతులు తిట్టడం వెనుక పెద్ద కుట్ర … Read more

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 304 వాహనాలు సీజ్

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర (2026) వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిన్న ఒక్క రాత్రే రికార్డు స్థాయిలో 304 వాహనాలను (కార్లు, బైకులు) సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. నేరం తీవ్రతను … Read more

TG News: సాగునీటి శాఖ రూ. 22 వేల కోట్ల బకాయిలు

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. గత ఐదేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పెరిగాయి. ఈ జాబితాలో సాగునీటి పారుదల శాఖ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క శాఖే ఏకంగా రూ. 22,926 కోట్లు బాకీ పడటం గమనార్హం. ఆ తర్వాత హైదరాబాద్ వాటర్ బోర్డు రూ. … Read more

జీవోలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాల్సిందే.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో (G.O.), నోటిఫికేషన్లు, నిబంధనలు మరియు సర్క్యులర్లను తక్షణమే ఆయా శాఖల అధికారిక వెబ్‌సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. అదృశ్యమైన 15 వేల జీవోలు: విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు … Read more

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, కేసు నమోదు.

మన పత్రిక, వెబ్​డెస్క్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన మిట్టపల్లి రత్నా అనే మహిళ రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతి చెందారు. స్థానిక గోపాల్‌పూర్ ఎక్స్ రోడ్ (Gopalpur X Road) పై ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చల్మెడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ … Read more

నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. కేసీఆర్ అధ్యక్షతన సమావేశం.

మన పత్రిక, వెబ్​డెస్క్: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ అధ్యక్షతన నేడు (ఆదివారం) కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ఎలా … Read more

Bonus: రైతులకు రూ.500.. సోమవారం నుంచే జమ.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సన్న వడ్ల బోనస్’ (Sanna Vadlu Bonus) పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. సన్న రకాలు సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ. 500 చొప్పున అదనపు బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, రూ. 649 కోట్ల నిధులను ఆమోదించింది. ముఖ్యాంశాలు: