జగిత్యాల జిల్లా ధర్మపురిలో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఉన్న శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం నిత్య పూజల కోసం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన అర్చకులు, తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటనలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని వెండి ప్రాణ వట్టం, అమ్మవారి వెండి ముఖ కవచాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు అర్చకులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చోరీకి గురైన ఆభరణాల వివరాలను సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
