Advertisement

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. టీషర్ట్ విప్పేసిన హరీశ్ రావు

హైదరాబాద్‌: శాసనసభ సమావేశాల ప్రారంభం వేళ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనగా నల్ల టీషర్టులతో వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్‌రావు, కేపీ వివేకానంద్‌ టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు.

ఈ తోపులాటలో ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి స్పృహతప్పి పడిపోగా, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తనతో అమానుష్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలో కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సభను నెల రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement