Anuj Agnihotri UPSC | యూపీఎస్సీ టాపర్‌గా డాక్టర్ అనుజ్ అగ్నిహో

Anuj Agnihotri UPSC

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC TOPPER) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 6, 2026న యూపీఎస్సీ ప్రకటించిన తుది మెరిట్ జాబితాలో డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ (AIR 1) సాధించి సత్తా చాటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసుల కోసం నిర్వహించే ఈ కఠినమైన పరీక్షలో మొదటి స్థానం సాధించడం పట్ల … Read more

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సరికొత్త ‘జనాభా విధానం’- ముగ్గురు పిల్లలను కంటే ₹25,000 నగదు ప్రోత్సాహకం

Nara Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పాటిస్తున్న “జనాభా నియంత్రణ” స్థానంలో ఇప్పుడు “జనాభా నిర్వహణ” (Population Management) దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) మరియు పెరుగుతున్న వృద్ధుల జనాభా దృష్ట్యా, యువ శక్తిని పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సరికొత్త డ్రాఫ్ట్ పాలసీని ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రోత్సాహకాలు ఇవే: ఈ కొత్త విధానం ప్రకారం, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనే దంపతులకు … Read more

AP Local Body Elections : ఏపీ జడ్పీ ఎన్నికలపై పవన్ కీలక ప్రకటన.

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల ప్రాతిపదికనే జడ్పీ (ZPTC) ఎన్నికలు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఆయన సభలో స్పష్టం చేశారు. గురువారం బడ్జెట్ పద్దులపై ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల పునర్విభజనపై ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటే ప్రతి మొక్కకు … Read more

తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల: డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (BSE Telangana) అధికారికంగా హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే విద్యార్థులు ముందుగానే హాల్ టికెట్లను ప్రింట్ తీసుకోవడం ఉత్తమం. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దానిపై … Read more

సెమీస్‌లో భారత్ ఘన విజయం: ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు!

team india into t20 world cup finals

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన ఉత్కంఠభరిత పోరులో, భారత జట్టు ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో, ఇటు బ్యాటింగ్, అటు ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ పైచేయి సాధించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ ఓపెనర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు … Read more

బిగ్ అప్డేట్: ఒక వారం ముందే రిలీజ్ అవబోతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”!

utsaad bhagat singh

OG లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. ఇప్పుడు ఈ సినిమాకి సంభందించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా విడుదల తేదీని మార్చి 26 నుండి మార్చి 19 కి ప్రీ పోన్ చేయడం జరిగింది. అనగా ఇంతకుముందు చెప్పిన తేదీ కన్నా ఒక వారం ముందే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇదివరకే మార్చి … Read more

Suryapet : వ్యాపారులకు ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్!

మన పత్రిక వెబ్​డెస్క్, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా వెలసిన ఆక్రమణలను పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా తొలగించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై సాయిరాం మాట్లాడుతూ.. వ్యాపారులు రోడ్లను ఆక్రమించి దుకాణాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో రోడ్లపైకి వచ్చిన షాపుల సామగ్రిని, మట్టి కుప్పలను క్లియర్ చేశారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా … Read more

CM Revanth Reddy భారీ యాక్షన్ ప్లాన్.. 99 రోజుల పాటు ‘ప్రజా పాలన – ప్రగతి’!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2న గ్రామసభలతో ప్రారంభమై, జూన్ 2న … Read more

బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. 25 దుకాణాలు దగ్ధం, రూ.5 కోట్ల నష్టం!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు.. ప్రధాన రహదారి వెంట ఉన్న సుమారు 25 ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బాచుపల్లి-మియాపూర్ రూట్లోని కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో ఈ దుకాణాలు ఉన్నాయి. వ్యాపారులు అక్కడే నివాసం ఉంటుండటంతో, లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో మంటలు మరింత వేగంగా … Read more

Balka Suman Bail: జైలు నుంచి బాల్క సుమన్‌ రిలీజ్.. కోర్టు విధించిన షరతులు ఇవే!

మన పత్రిక వెబ్​డెస్క్, మంచిర్యాల: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ వద్ద మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 17న జరిగిన ఈ దాడి ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా.. పోలీసులు సుమన్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఏ. వీరయ్య షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. … Read more