హీరోయిన్లను ఆ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా? కెమెరామెన్లపై ‘కాంతార’ సప్తమి గౌడ సంచలన వ్యాఖ్యలు!

మన పత్రిక వెబ్​డెస్క్: ‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి సప్తమి గౌడ తాజాగా ఒక సామాజిక అంశంపై గళం విప్పారు. సినిమా ఫంక్షన్లు, పబ్లిక్ ఈవెంట్లలో ఫోటోగ్రాఫర్లు, కెమెరా ఆపరేటర్లు హీరోయిన్ల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది ఇండస్ట్రీలోని హీరోయిన్లు, ఇతర నటీమణులందరూ … Read more

టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!

మన పత్రిక వెబ్​డెస్క్: భారత క్రికెట్ స్టార్, టీమిండియా సంచలనం రింకు సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా ప్రాణాంతక స్టేజ్-4 క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ వార్త విన్న వెంటనే టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఉన్న రింకు సింగ్ హుటాహుటిన తన కుటుంబం వద్దకు బయలుదేరారు. … Read more

AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌తో పాటు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష (AP BRAGCET 2026) జరగనుంది. ఇప్పటికే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ … Read more

TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అధికారులు శుభవార్త చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) ఆదివారం టీజీ పీజీఈసెట్-2026 (TG PGECET) నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎం.టెక్, ఎం.ఫార్మసీ తదితర పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఈ ఎంట్రెన్స్ పరీక్ష అత్యంత కీలకం కానుంది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. టీజీ … Read more

మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!

మన పత్రిక వెబ్​డెస్క్: ప్రతి మనిషి ఆలోచనా తీరు, ఇష్టాయిష్టాలు మరొకరితో పోల్చుకుంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సాధారణంగా మనం రాశులు, న్యూమరాలజీ లేదా పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి ఒక వ్యక్తి భవిష్యత్తు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటాం. అయితే మనస్తత్వశాస్త్రం ప్రకారం, మీరు ఎక్కువగా ఇష్టపడే రంగు (ఫేవరెట్ కలర్) ఆధారంగా కూడా మీరెలాంటి వారో, మీ మైండ్ సెట్ ఏంటో ఇట్టే చెప్పేయొచ్చు. మీ ఫేవరెట్ కలర్ ఎరుపు (Red) అయితే, మీరు జీవితాన్ని … Read more

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో కొద్ది రోజులుగా చలి తీవ్రత తగ్గిపోయి, ఎండలు నెమ్మదిగా పెరుగుతున్న వేళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ వాతావరణ శాఖ (IMD) రాష్ట్ర ప్రజలకు తాజా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంటూ అధికారికంగా ఎల్లో హెచ్చరికలను (Yellow … Read more

ఉచితాల పేరుతో దేశాన్ని నాశనం చేస్తారా? రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: దేశంలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రకటిస్తున్న ‘ఉచితాల సంస్కృతి’ (Freebie Culture)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. ఇలాంటి ధోరణి దేశ ఆర్థిక పురోగతికి గొడ్డలి పెట్టు లాంటిదని సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. తక్షణమే ఈ ఉచిత విధానాలపై పునఃసమీక్ష జరపాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (Tangedco) దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ … Read more

ఏపీ నిరుద్యోగులకు కరెంట్ శాఖ గుడ్ న్యూస్: 2,947 పోస్టులతో భారీ నోటిఫికేషన్!

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విద్యుత్ శాఖలో కొలువుల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీపికబురు అందించారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APEPDCL) పరిధిలో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన శాసనసభ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం అసెంబ్లీ … Read more

TG EAPCET 2026: సిలబస్ వచ్చేసింది.. రేపటి నుంచే దరఖాస్తులు.. డౌన్లోడ్ చేసుకోండిలా!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా, తాజాగా అధికారులు పరీక్ష సిలబస్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రేపటి నుంచి (ఫిబ్రవరి 19) ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకునేందుకు వీలుగా సిలబస్ వివరాలను ప్రకటించారు. సిలబస్‌ను డౌన్లోడ్ చేసుకోవాలనుకునే విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ … Read more

Wipro Freshers Recruitment : విప్రో నుండి ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..

Latest Wipro Jobs notification

నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ IT సంస్థ అయిన విప్రో (Wipro) సంస్థ నుండి సర్వీస్ డెస్క్ అనలిస్ట్ (Service Desk Analyst) రోల్ కోసం ఉద్యోగాల ప్రకటన చేసారు. బెంగుళూర్ లో ఉన్న విప్రో ఆఫీస్ లో ఈ వాకిన్ డ్రైవ్ (Walkin Drive) జరుగనుండగా, ఫిబ్రవరి 18 నుండి 21, 2026 వరకు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ఇక ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ వాకిన్ డ్రైవ్‌కు అర్హులు. ఈ … Read more