మన పత్రిక వెబ్‌డెస్క్: ప్రతి మనిషి ఆలోచనా తీరు, ఇష్టాయిష్టాలు మరొకరితో పోల్చుకుంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సాధారణంగా మనం రాశులు, న్యూమరాలజీ లేదా పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి ఒక వ్యక్తి భవిష్యత్తు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటాం. అయితే మనస్తత్వశాస్త్రం ప్రకారం, మీరు ఎక్కువగా ఇష్టపడే రంగు (ఫేవరెట్ కలర్) ఆధారంగా కూడా మీరెలాంటి వారో, మీ మైండ్ సెట్ ఏంటో ఇట్టే చెప్పేయొచ్చు.
మీ ఫేవరెట్ కలర్ ఎరుపు (Red) అయితే, మీరు జీవితాన్ని చాలా ఉత్సాహంగా గడుపుతారు. మీ మాటల్లో చురుకుదనం ఉంటుంది, ఎక్కడికెళ్లినా అందరి దృష్టి మీ వైపే ఉండేలా ఆకర్షిస్తారు. అదే నీలం (Blue) రంగును ఇష్టపడే వారైతే ఎప్పుడూ ప్రశాంతంగా, బ్యాలెన్స్డ్గా ఉంటారు. వీరు కుటుంబ సభ్యులతో మంచి బంధాన్ని కొనసాగిస్తూ, వివాదాలకు దూరంగా ఎంతో ఆనందంగా జీవిస్తారు.
గులాబీ (Pink) రంగును ఇష్టపడే వారు ఎంతో ఆకర్షణీయంగా ఉంటూనే, భావోద్వేగాలకు త్వరగా లోనవుతారు. వీరు వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఇక ఆకుపచ్చ (Green) రంగు ఇష్టమైన వారు స్వేచ్ఛను, సాహసాలను అమితంగా ఆరాధిస్తారు. వీరు సమాజంలో చురుకుగా ఉంటూ వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తారు.
తెలుపు (White) రంగును ఆరాధించే వారు ఎప్పుడూ కూల్‌గా, క్రమశిక్షణతో ఉంటారు. జాలి, దయ మెండుగా ఉండే వీరు ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటూ వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇక పసుపు (Yellow) రంగు ఇష్టపడే వారు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. కష్ట సమయంలో కూడా పాజిటివ్‌గా ఉంటూ, తమ చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటారు.
నలుపు (Black) రంగును ఇష్టపడే వారు స్వతంత్ర భావాలు కలిగి ఉండి, తమ గోప్యతను కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. వీరు ఎమోషనల్ డ్రామాలకు దూరంగా, సెన్సిటివ్‌గా ఉంటారు. ఊదా (Purple) రంగును ఇష్టపడే వారు ఎక్కువగా బాధ్యతాయుతంగా ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ, ఆఫీస్‌లో అందరి మద్దతు కూడగట్టుకుంటారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.