ఇండియా వదిలేసి వెళ్లిపోతున్న లక్షల మంది.. పన్నుల వేధింపులే కారణమా?

మన పత్రిక, వెబ్​డెస్క్: “నా దేశం అంటే నాకు ప్రాణం.. కానీ ఇక్కడి వ్యవస్థను భరించలేకపోతున్నా..” అంటూ బెంగళూరుకు చెందిన టెకీ కమ్ వ్యాపారి రోహిత్ ప్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కేవలం 18 నెలల్లో రూ.4 కోట్లు పన్ను నిజాయితీగా కట్టినా, అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదని, అందుకే ఇండియా వదిలేసి వెళ్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్క రోహిత్ ఆవేదన మాత్రమే కాదు.. గత 14 ఏళ్లలో … Read more

గ్రామగ్రామాన మహిళా భవనాలు.. ఒక్కో దానికి రూ.10 లక్షలు మంజూరు!

మన పత్రిక, వెబ్​డెస్క్: మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు చెట్ల కింద, ఆలయాల వద్ద సమావేశాలు నిర్వహించే అవస్థలకు చెక్ పడనుంది. ఉపాధిహామీ నిధులతో ప్రతి గ్రామంలో ‘మహిళా సమాఖ్య భవనాల’ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 561 గ్రామ సమాఖ్యలు ఉండగా, ఇప్పటివరకు 256 గ్రామాల్లో స్థలాలను గుర్తించినట్లు … Read more

సర్కార్‌పై హరీష్ రావు ఫైర్.. ఎజెండాపై మండిపాటు

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) శీతాకాల సమావేశాల నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన బీఏసీ (BAC) సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల రంగంపై ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వనున్న నేపథ్యంలో, ప్రతిపక్షంగా తమకు కూడా పీపీటీ … Read more

TG Assembly: మాజీ సర్పంచుల ముట్టడి.. రూ.531 కోట్ల కోసం రచ్చ!

మన పత్రిక, వెబ్​డెస్క్: పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ మాజీ సర్పంచులు చేపట్టిన ఆందోళనతో తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మారినా విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.531 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వారు తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో … Read more

మాజీ సర్పంచులు, ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు.. సర్కార్‌పై ఆగ్రహం

మన పత్రిక, వెబ్​డెస్క్: పెండింగ్ బిల్లులు, జీతాల పెంపు డిమాండ్‌తో మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సూర్యాపేట నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పలువురు నాయకులను, ఆశా వర్కర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. దీంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు విస్మరించిందని వారు మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా … Read more

యూట్యూబ్ స్టార్ టు సర్పంచ్..

మన పత్రిక, వెబ్​డెస్క్: సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారి, ఇప్పుడు ప్రజాసేవలో నిమగ్నమయ్యారు ఓ యువతి. షార్ట్ ఫిలింల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన రజిత.. ఇప్పుడు సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేశారు. యూట్యూబర్‌గా మొదలైన ఆమె ప్రయాణం, నేడు ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యే స్థాయికి చేరింది. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సర్పంచ్‌గా ఎన్నికైన రజిత, మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలతో … Read more

మాజీ సర్పంచ్ తల్లి మృతి.. కాంగ్రెస్ నేతల నివాళి

మన పత్రిక, వెబ్​డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గుండాల నరసింహ గౌడ్ మాతృమూర్తి గుండాల ఆండాలు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గ్రామానికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి … Read more

శివాజీ వ్యాఖ్యలపై రచ్చ.. బట్టల సత్తిగాడు అంటూ ఎస్‌కేఎన్ ఘాటు కౌంటర్

మన పత్రిక, వెబ్​డెస్క్: “అసభ్య వస్త్రధారణే మందల ప్రవర్తనకు కారణమా?” అంటూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఎదుట ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ, తనపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. అయితే, సమస్య బట్టల్లో లేదని, అది కేవలం ‘మూక ఉన్మాదం’ అని సినీ విశ్లేషకులు మండిపడుతున్నారు. నిండుగా కప్పుకున్నా సమంత వంటి వారికి గతంలో ఇబ్బందులు తప్పలేదని, మగాళ్లను కూడా ఈ మూకలు వదలవని గుర్తుచేస్తున్నారు. తాజాగా … Read more

కరెంట్ షాక్‌తో కొడుకు, రైలు కింద పడి తండ్రి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో కొడుకు మరణించగా, ఆ బాధను తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. అట్లూరి సునీల్ అనే యువకుడు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా, భార్య ప్రస్తుతం … Read more

కొండగట్టుకు పవన్ కల్యాణ్.. రూ.35 కోట్లతో టీటీడీ పనులకు శంకుస్థాపన

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టును సందర్శించనున్నారు. 2026 జనవరి 3 (శనివారం) ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం పనులకు భూమిపూజ నిర్వహిస్తారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా … Read more