Advertisement

అర్ధరాత్రి ఇండోనేషియాలో భూకంపం

మన పత్రిక: ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియాలో బుధవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించి భయాందోళనలు రేకెత్తించింది. రిక్టర్ స్కేలుపై 6.1 నుంచి 6.8 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు తూర్పు ఇండోనేషియాలోని తెర్నేట్ సమీప సముద్ర గర్భంలో కేంద్రీకృతమయ్యాయి. భూకంపం సముద్ర మట్టానికి తక్కువ లోతులో సంభవించడంతో సునామీ ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక సంస్థ BMKG తక్షణమే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి పొరుగు దేశాలు అప్రమత్తమయ్యాయి. అలాగే ఇండోనేషియాలోని సుమత్రాప్రాంతాల్లో ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Advertisement

ఈ ప్రకృతి విపత్తుతో పలు భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రాణనష్టంపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు. పరిస్థితి పూర్తిగా సాధారణం అయ్యే వరకు మరో 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Advertisement