‘స్పిరిట్’పై నిర్మాత ప్రణయ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TG CINEMA: రివ్యూలతో సినిమాల స్థాయిని ఎప్పటికీ తగ్గించలేరని నిర్మాత ప్రణయ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన నిర్మించిన ‘రోమాంచకం’ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. కొందరు కావాలనే విమర్శలు చేశారని ఆయన మండిపడ్డారు. ఒక ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడం వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుందని, రివ్యూల పేరుతో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. తాను నిర్మిస్తోన్న భారీ అప్‌కమింగ్ చిత్రం ‘స్పిరిట్’ గురించి ప్రస్తావిస్తూ.. వారికి నిజంగా అంత … Read more

బిగ్‌బాస్ ఎంట్రీపై సుప్రీతా క్లారిటీ.. తల్లి ఇష్టమే నాకెక్కువ

TG: టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రీతా బిగ్‌బాస్ పదో సీజన్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తాజాగా సుప్రీతా స్పందించి స్పష్టతనిచ్చారు. తనకు బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ, తల్లి సురేఖా వాణికి ఉన్న ఆందోళనల కారణంగా తాను ఈ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. హౌస్‌లో భావోద్వేగాలను తాను కంట్రోల్ చేసుకోగలనా లేదా అనే సందేహాలు తన తల్లికి … Read more

బిగ్‌బాస్ 10: ఐదో రోజే చైత్ర ఎలిమినేషన్

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో ఐదో రోజు ఎపిసోడ్‌లోనే చైత్ర ఎలిమినేట్ అయ్యారు. హైరిస్క్ జోన్‌లో ఉన్న సభ్యుల ఓటింగ్ ఆధారంగా ఈ నిర్ణయం వెలువడింది.

‘ది పారడైజ్’ చిత్రంలో యాక్షన్ వెనుక ఉన్న కథేంటి?

నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో వస్తున్న ‘ది పారడైజ్’ సినిమాలో హింసతో పాటు తల్లి, కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధం కూడా ప్రధానంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.

‘ది పారడైజ్’ ట్రైలర్ విడుదల చేయకపోవడానికి కారణం చెప్పిన నాని

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ చిత్రానికి ట్రైలర్ విడుదల చేయడం లేదని, సినిమాను నేరుగా థియేటర్లలోనే వీక్షించాలని నటుడు నాని స్పష్టం చేశారు.

సుద్దాలకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం

కరీంనగర్: ప్రముఖ కవి, జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజకు 2026 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక ‘తెలంగాణ తెలుగు తేజం’ సాహిత్య పురస్కారం లభించింది. తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. పురస్కార కమిటీ ఛైర్మన్, అవార్డు వ్యవస్థాపకుడు కెప్టెన్‌ డా.బుర్ర మధుసూదన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి శుక్రవారం ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల … Read more

నటీ సమంతకు సర్ నోటీసులు

హైదరాబాద్: ఓటరు సమగ్ర ఇంటింటి సర్వే ప్రక్రియలో భాగంగా ప్రముఖ సినీ నటి సమంతకు నోటీసు అందించినట్లు శేరిలింగంపల్లి సర్కిల్‌ అధికారులు వెల్లడించారు. నానక్‌రాంగూడలోని ఆమె నివాసంలో గత నెలలోనే సమంత తల్లికి ఈ నోటీసు అందజేసినట్లు తెలిపారు. గత నెల 31న నిర్వహించిన హియరింగ్‌కు సమంత వ్యక్తిగతంగా హాజరు కాలేదని, ఆమె ప్రతినిధులు కూడా ఎలాంటి ధ్రువపత్రాలు తీసుకోరాలేదని శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్, నియోజకవర్గం ఓటరు జాబితా బాధ్యుడు నారాయణ అమిత్‌ మాలెంపాటి స్పష్టం చేశారు. … Read more

మళ్లీ పట్టాలెక్కనున్న కమల్ హాసన్ ‘ఇండియన్ 3’?

కమల్ హాసన్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ‘ఇండియన్ 3’ చిత్ర పనులు త్వరలోనే తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కుమారుడి ముఖాన్ని పరిచయం చేసిన వరుణ్ తేజ్, లావణ్య

టాలీవుడ్ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెల ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ జంట సోషల్ మీడియాలో ప్రత్యేక చిత్రాలను పంచుకుంది.

బిగ్ బాస్ 10: నాలుగో రోజే చరణ్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ ప్రారంభమైన కొద్ది రోజులకే తొలి వికెట్ పడింది. ఆటలో నిలదొక్కుకోలేకపోయిన కంటెస్టెంట్ చరణ్ హౌస్ నుండి బయటకు వచ్చారు.