టీజీ టెట్ టెస్ట్ లింక్ విడుదల | TG TET 2026 Mock Test

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026)కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా అధికారిక మాక్ టెస్ట్ లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలో పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మాక్ టెస్ట్ కోసం అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లింక్‌లో డిఫాల్ట్‌గా ఉండే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో … Read more

School Holidays: స్కూళ్లకు 9 రోజులు సెలవులు.. సంక్రాంతి హాలిడేస్ లిస్ట్ ఇదే

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు వరుసగా 9 రోజుల పాటు సెలవులను ఖరారు చేసింది. జనవరి 10 (రెండో శనివారం) నుంచి సెలవులు మొదలై జనవరి 18 (ఆదివారం) వరకు కొనసాగుతాయని, తిరిగి జనవరి 19న బడులు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు. గత ఏడాది కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా, ఈసారి శని, ఆదివారాలు కలిసి రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. పొరుగున … Read more

అమరావతిలో హైకోర్టు పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ

రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. తాజాగా వివిధ సంస్థలకు 49.50 ఎకరాల భూమిని కేటాయిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బాసిల్ వుడ్స్, సెయింట్ మేరీస్ స్కూల్, సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్, బ్యాంకులు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం 12.66 ఎకరాలను కేటాయించారు. గతంలో ఇచ్చిన 42.30 ఎకరాల్లో స్వల్ప మార్పులు చేశారు. మరోవైపు, ప్రతిష్టాత్మక హైకోర్టు నిర్మాణంలో కీలకమైన ర్యాప్తు (Raft) … Read more

చిల్లపల్లి సర్పంచ్ గెలిచిన వెంటనే నీటి సమస్య పరిష్కారం..

చిల్లపల్లి సర్పంచ్‌గా భారీ మెజారిటీతో విజయం సాధించిన యువ నాయకుడు గోపు సంతోష్ కుమార్, గెలిచిన వెంటనే తన పనితీరుతో ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఆయన, ప్రజలకు ఇచ్చిన మాటను చేతల్లో చేసి చూపిస్తున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న బోరు గత కొద్ది రోజులుగా పనిచేయకపోవడంతో స్థానికులు, విద్యార్థులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ సంతోష్ కుమార్ వెంటనే … Read more

వెండి ఒక్కరోజే రూ.8,951 పెరుగుదల.. కిలో రూ.2.45 లక్షలు | Silver Price Today

బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతూ సామాన్యులకు షాక్ ఇస్తోంది. ఈరోజు (డిసెంబర్ 26) వెండి ధర ఏకంగా రూ.8,951 మేర పెరిగి ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.2,32,741 గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ధరలు చుక్కలను తాకుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,45,100కి చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో … Read more

సంక్రాంతి కోడి పందేలు.. ముదినేపల్లిలో భారీ ఏర్పాట్లు

సంక్రాంతి పండుగకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో కోడి పందేల నిర్వహణకు పందెంరాయుళ్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. గురజ, పెదపాలపర్రు, వాడవల్లి, వైఎస్ఆర్ కాలనీ తదితర గ్రామాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేసే పనులు ఊపందుకున్నాయి. పోలీసులు జూదం సాగనివ్వబోమని హెచ్చరిస్తున్నా, పండుగ సంబరాల పేరుతో పందేలకు సై అంటున్నారు. గత నాలుగు నెలలుగా ప్రత్యేక షెడ్లలో పందెం కోళ్లను పోషిస్తున్నారు. కాకి, డేగ, నెమలి, పింగళి వంటి జాతి … Read more

ధర్మపురి ఆలయాల్లో చోరీ.. వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు

జగిత్యాల జిల్లా ధర్మపురిలో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఉన్న శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం నిత్య పూజల కోసం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన అర్చకులు, తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని వెండి ప్రాణ వట్టం, అమ్మవారి వెండి ముఖ కవచాన్ని … Read more

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి చంపిన భర్త

హైదరాబాద్‌లోని నల్లకుంటలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కిరాతక భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు ఘటన జరిగిన 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో వెంకటేష్ వేధించేవాడు. గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిన త్రివేణిని నమ్మించి నగరానికి … Read more

నేడు కేసీఆర్ కీలక భేటీ.. రేవంత్ సర్కార్‌పై ఫైర్

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో నీళ్ల రాజకీయం భగ్గుమంటోంది. కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడంపై గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు రంగంలోకి దిగారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి … Read more

పటాన్‌చెరులో జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు.. జనవరి 4న మైత్రి మైదానంలో ఈవెంట్

మన పత్రిక, వెబ్​డెస్క్: పటాన్‌చెరు పట్టణం జాతీయ స్థాయి క్రీడా సంబరానికి వేదిక కానుంది. జనవరి 4న స్థానిక మైత్రి మైదానంలో ‘జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్’ పోటీలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. యువత శారీరక దారుఢ్యం, మానసిక క్రమశిక్షణతో ఎదగాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు. పటాన్‌చెరు గడ్డపై తొలిసారిగా … Read more