బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతూ సామాన్యులకు షాక్ ఇస్తోంది. ఈరోజు (డిసెంబర్ 26) వెండి ధర ఏకంగా రూ.8,951 మేర పెరిగి ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కిలో వెండి ధర రూ.2,32,741 గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ధరలు చుక్కలను తాకుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,45,100కి చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కిలో ధర రూ.2,34,100గా నమోదైంది. కేవలం ఒక్క రోజులోనే ఈ స్థాయిలో ధరలు పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
