Rythu Bharosa : రైతు భరోసా లేట్‌..? సర్కార్ కొత్త నిర్ణయం ఇదే..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి నాట్లు పూర్తయ్యాయి. సంక్రాంతి పండుగకే ఈ నిధులు తమ ఖాతాల్లో జమవుతాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూశారు. కానీ, పండుగ వెళ్లిపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం నిధుల విడుదలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ జాప్యం జరుగుతోంది. ఇదిలా … Read more

చీపురు పట్టిన ఎమ్మెల్యే..

మన పత్రిక వెబ్​డెస్క్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సెంటర్‌లో శుక్రవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిత్యంలాగే పరిసరాల పరిశుభ్రతలో భాగంగా వీధులను శుభ్రం చేస్తుండగా, అటుగా వచ్చిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా వారితో కలిసిపోయారు. కారు దిగిన ఆయన నేరుగా చేతిలోకి చీపురు తీసుకుని రోడ్ల వెంట ఉన్న చెత్తను తొలగిస్తూ శుభ్రత పనుల్లో భాగస్వాములయ్యారు. ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టి … Read more

Nalgonda: సూపర్ స్మార్ట్ సిటీగా మార్చాలి.. కొత్త కమిషనర్‌కు మంత్రి కోమటిరెడ్డి దిశానిర్దేశం

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శరత్ చంద్ర గురువారం రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్‌కు మంత్రి అభినందనలు తెలిపి శుభాకాంక్షలు చెప్పారు. కొత్త బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కమిషనర్ మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణ అభివృద్ధి, పరిపాలన విషయాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కార్పొరేషన్ … Read more

వసంత పంచమి 2026: నేడే సరస్వతీ పూజ.. అక్షరాభ్యాసం ముహూర్తం, స్తోత్రం ఇదే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: చదువుల తల్లి, జ్ఞాన ప్రదాత అయిన సరస్వతీ దేవిని ఆరాధించే అత్యంత పవిత్రమైన రోజు రానే వచ్చింది. ప్రతి ఏటా మాఘమాసం శుక్లపక్ష పంచమి నాడు జరుపుకునే ‘వసంత పంచమి’ పర్వదినాన్ని నేడు (శుక్రవారం, జనవరి 23) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దీనిని ‘శ్రీ పంచమి’ అని కూడా పిలుస్తారు. చిన్నారుల విద్యాభ్యాసానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున … Read more

TGSRTC Recruitment 2026 : ఆర్టీసీలో 198 ఉద్యోగాలు షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. సంస్థలో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల నియామకాల కోసం నిర్వహించాల్సిన రాత పరీక్ష తేదీలను అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఛైర్మన్ తాజా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మార్చి 29వ తేదీన … Read more

గుర్రంపోడు కొత్త తహశీల్దార్‌గా ఎన్. కరుణ శ్రీ.. బాధ్యతలు స్వీకరణ

మన పత్రిక వెబ్​డెస్క్, గుర్రంపోడు: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల నూతన తహశీల్దార్‌గా ఎన్. కరుణ శ్రీ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించిన తహశీల్దార్ పి. శ్రీనివాస్ మిర్యాలగూడకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుమలగిరి (సాగర్) నుంచి బదిలీపై వచ్చిన కరుణ శ్రీ నూతన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల పరిధిలోని భూ సంబంధిత, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని … Read more

మేడారంలో పెంపుడు కుక్కకు తులాభారం.. హీరోయిన్ తీరుపై భక్తుల ఫైర్.. చివరకు సారీ!

మన పత్రిక వెబ్​డెస్క్, ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ నటి టీనా శ్రావ్య చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా భక్తులు తమ బరువుకు సరిపడా బంగారాన్ని (బెల్లం) అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. దీనిని తులాభారం అంటారు. అయితే, హీరోయిన్ టీనా శ్రావ్య ఏకంగా తన పెంపుడు కుక్కకు తులాభారం వేయించి అమ్మవార్లకు బంగారం సమర్పించడం … Read more

Nalgonda: రూ.11.38 కోట్ల రుణాలు పంపిణీ..

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. … Read more

ఒక్కరోజులో రూ.22,500 పెరిగిన బంగారం ధర.. తులం రేటు ఎంతో తెలుసా?

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: పసిడి ప్రియులకు సోమవారం (జనవరి 19) గట్టి షాక్ తగిలింది. బంగారం ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. సోమవారం మార్కెట్‌లో 22 క్యారెట్ల 100 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.22,500 పెరగడం గమనార్హం. దీంతో ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. ఈరోజు (జనవరి 19) బంగారం ధరలు ఇలా.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు … Read more

TG News : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతలు.. 

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు వ్యూహ రచన చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు, సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఎవరికి ఏ బాధ్యత? మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన ఇంచార్జీల … Read more