BIG ALERT.. నేడు రెండు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

మన పత్రిక: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రెండు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీలోని అల్లూరి, శ్రీకాకుళం, పోలవరం, కర్నూలు, నంద్యాల, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో వేడి గాలులు తీవ్రంగా … Read more

ఐపీఎల్‌లో ‘సూర్యవంశీ’ విధ్వంసం.. చెన్నైపై రాజస్థాన్ ఘన విజయం

మన పత్రిక, క్రికెట్: ఐపీఎల్-2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సర్వశక్తులూ ఒడ్డి చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకోగా, రాయల్స్ బౌలర్ల ధాటికి చెన్నై కుప్పకూలింది. తేలిపోయిన చెన్నై బ్యాటింగ్ మొదట బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కేకు ఆరంభంలోనే చుక్కెదురైంది. రాజస్థాన్ పేసర్లు నండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులతో చెన్నై … Read more

నిర్మల్: గంజాయి మత్తు ఇచ్చి.. ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి

మన పత్రిక, క్రైం: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితులు బాలికలకు గంజాయి మత్తు ఇచ్చి ఓ పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ ఒక బాలికపై లైంగిక దాడి జరగగా, మరో మైనర్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. బాధితులు మహారాష్ట్రకు చెందిన వలస కూలీల కుటుంబానికి చెందినవారని స్థానికులు తెలిపారు. సున్నితమైన అంశం కావడంతో … Read more

శరవేగంగా ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్.. 70 శాతం పూర్తి!

మన పత్రిక, సినిమా: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’పై అంచనాలు పెరుగుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నూతన నటి ఇమాన్వీ కథానాయికగా పరిచయం అవుతోంది. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని Ramoji Film Cityలో షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రభాస్ లేని సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తుండగా, ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తైంది. బ్రిటీష్ కాలం … Read more

మేడ్చల్: విద్యార్థినిపై ఉపాధ్యాయుల వేధింపులు

మన పత్రిక, తెలంగాణ: మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిపై లెక్చరర్లు వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. కాప్రాకు చెందిన తిరునాయన అనే విద్యార్థిని, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ తన తల్లితో కలిసి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బీఎస్సీ డేటా సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్న బాధితురాలు, అనారోగ్య కారణాలతో కళాశాలకు తరచూ హాజరు కాలేకపోయారు. ఇందుకు సంబంధించి వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లిస్తూ … Read more

TG: ప్రభుత్వ తీరుపై ‘గులాబీ’ గర్జన.. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్!

మన పత్రిక, హైదరాబాద్: పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వద్దనే పోలీసు శాఖ ఉన్నప్పటికీ నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడే పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో పోలీసులకు గౌరవం లభించిందని, అనేక పోస్టులను భర్తీ చేసి కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. … Read more

జపాన్ దిగ్గజానికి బన్నీ అరుదైన కానుక

మన పత్రిక, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి భారతీయ సంస్కృతిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. జపాన్‌కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్సు కోసానోకు ‘సీతారామ కళ్యాణం’ చిత్రపటాన్ని బహూకరించడం ప్రత్యేకంగా నిలిచింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ కానుకను అందించడం ద్వారా భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి పరిచయం చేయాలన్న సంకల్పాన్ని ఆయన వ్యక్తపరిచినట్లు సమాచారం. ఈ సందర్భంగా శ్రీరాముడి కథ, భారతీయ ఇతిహాసాల ప్రాముఖ్యత గురించి కూడా కోసానోకు వివరించినట్లు తెలుస్తోంది. … Read more

నేటి నుంచే ఐపీఎల్.. తొలి పోరులో బెంగళూరు vs హైదరాబాద్‌!

ఐపీఎల్‌ 19వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. పది జట్లు మరోసారి అసలైన టీ20 మజాను అందించేందుకు పోటీపడుతున్నాయి. శనివారం బెంగళూరు-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానుంది. గతేడాది టైటిల్‌ గెలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ట్రోఫీని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఒకసారి ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో కప్పుపై దృష్టి సారించింది. చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు తమ ఆధిపత్యాన్ని మళ్లీ చాటుకోవాలని చూస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గత సీజన్‌ నిరాశను మరచి నాలుగో … Read more

ఐఫోన్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్

మన పత్రిక, బిజినెస్: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు కొత్త ఫీచర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్‌ యూజర్ల కోసం ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్‌ ఖాతాలను వినియోగించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంపైనా విస్తరించనుంది. దీంతో వ్యక్తిగత, వృత్తిపర అవసరాల కోసం రెండు ఫోన్లు వాడాల్సిన అవసరం లేకుండా పోతుంది. యాప్‌లో కింద భాగంలో … Read more

రణబలి షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంట

మన పత్రిక, సినిమా: ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ మ్యారేజ్ లైఫ్‌ను ఆస్వాదిస్తూ కూడా పనిలో ఏమాత్రం విరామం ఇవ్వడం లేదు. ఈ జంట కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో విజయ్ ‘రణబలి’గా, రష్మిక ‘జయమ్మ’గా కనిపించనున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. … Read more