మన పత్రిక, సినిమా: ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ మ్యారేజ్ లైఫ్‌ను ఆస్వాదిస్తూ కూడా పనిలో ఏమాత్రం విరామం ఇవ్వడం లేదు. ఈ జంట కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో విజయ్ ‘రణబలి’గా, రష్మిక ‘జయమ్మ’గా కనిపించనున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఇప్పటికే షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా అనంతపురంలో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగనున్న ఈ షెడ్యూల్లో విజయ్, రష్మికలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే షూటింగ్లో పాల్గొంటున్న ఈ జంట డెడికేషన్‌కు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులు వైరల్‌గా మారాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
