మన పత్రిక, సినిమా: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’పై అంచనాలు పెరుగుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నూతన నటి ఇమాన్వీ కథానాయికగా పరిచయం అవుతోంది. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని Ramoji Film Cityలో షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రభాస్ లేని సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తుండగా, ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తైంది. బ్రిటీష్ కాలం నేపథ్యంతో సాగే ఈ కథలో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడిగా కనిపించనున్నారు. ఇందులో హృద్యమైన ప్రేమకథ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14 లేదా దసరా పండుగకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ శేఖర్, నిర్మాతలు: నవీన్ యర్నేని, వై.రవిశంకర్.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
