మన పత్రిక, తెలంగాణ: మేడ్చల్ జిల్లా ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిపై లెక్చరర్లు వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. కాప్రాకు చెందిన తిరునాయన అనే విద్యార్థిని, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ తన తల్లితో కలిసి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం బీఎస్సీ డేటా సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్న బాధితురాలు, అనారోగ్య కారణాలతో కళాశాలకు తరచూ హాజరు కాలేకపోయారు. ఇందుకు సంబంధించి వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లిస్తూ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. అయితే, మొదటి సంవత్సరం నుంచే లెక్చరర్లు తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన ఫోన్లోని ఫోటోలను షేర్ చేస్తూ, వ్యక్తిత్వంపై అసత్య ప్రచారాలు చేశారని ఆరోపించారు.
ఇటీవల మళ్లీ అనారోగ్యం బారిన పడగా.. “కళాశాలకు రాకుండా ఎవరితో తిరుగుతున్నావు?” అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి మానసిక ఒత్తిడికి గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లి డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్లో కేసు నమోదు
- రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి
- వైఎస్ షర్మిల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి నారా లోకేశ్
