Telangana BC Reservation: 42% బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి

Telangana BC Reservation

అక్టోబర్ 6న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు — స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మనుసింగ్వితో వాదనలు జరుగుతాయి. ఇందిరా సహానీ కేసు తీర్పు ఆధారంగా రిజర్వేషన్లు కల్పించొచ్చని, సిపెక్ సర్వే డేటా ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని వారికి నమ్మకం. వాదనల సందర్భంగా డిప్యూటీ సీఎం, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి కూడా … Read more

TGICET 2025 ప్రత్యేక విడత కౌన్సెలింగ్

tg ICET 2025 SPECIAL PHASE COUNSELLING

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 6న నుంచి ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అర్హులైన వారికి 7వ తేదీ వరకు అవకాశం. 10వ తేదీ లోపు ప్రత్యేక విడత కింద సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి వివరాల కోసం https://tgicet.nic.in/default.aspx సందర్శించండి. Mana Patrika DeskMana … Read more

వికారాబాద్ లో భారీ వర్షాలు

Vikarabad Rain News

Vikarabad Rain News: భారీ వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గొట్టిముక్కుల, ద్యాచారం, నాగారం గ్రామాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోటిపల్లి ప్రాజెక్టు అలుగు ఉద్ధృతంగా పారుతోంది. నాగ సమందర్, కోటిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల రోడ్లు మునిగిపోయాయి. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team … Read more

తాండూరులో భారీ వర్షం జాతీయ రహదారి మూసివేత

Tandur Rain News

Tandur Rain News: తాండూరు మండల పరిధిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో కొత్లాపూర్ వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహించింది. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచాయి. వరద నీటిని తట్టుకునేలా ఎత్తు పెంచి కొత్త వంతెన నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and … Read more

రాజగోపాల్ రెడ్డికి విద్యాశాఖ?

Komatireddy Raj Gopal Reddy education minister

తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ( Komatireddy Raj Gopal Reddy ) అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉంది. తాను ఈ శాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని, అందుకే తన వద్దే ఉంచుకున్నానని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో, రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారని, అందుకే త్వరలోనే విద్యాశాఖ కేటాయిస్తారని ఆయన వర్గం ప్రచారం … Read more

TGTET 2025: రెండో సెషన్ నోటిఫికేషన్

TGTET NOTIFICATION 2025

పాఠశాల విద్యా శాఖలో దాదాపు 12 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆలోచిస్తోంది. అయితే, తొలుత దాదాపు 6 వేల పోస్టులతో మినీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. TET నోటిఫికేషన్ ( TGTET NOTIFICATION ) విడుదల అయిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే, TET క్వాలిఫై చేసిన అభ్యర్థులే … Read more

700 కోట్లు జమ – తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు శుభవార్త

700 crores for Employees pending bills clearance

Telangana News: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సెప్టెంబర్ నెలకు గానూ 700 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల సంఘాల నాయకులకు ఈ విషయం అధికారికంగా తెలిపారు. రెండు రోజుల్లోనే ఈ మొత్తం జమ చేస్తారని సమాచారం. సరెండర్, TSGLI, GPF బిల్లులు కూడా ఈ దశలో విడుదల అవుతాయనే ఆశ ఉంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఊరట కలిగించింది. పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. … Read more

తెలంగాణలో ఎన్నికల కోడ్ – బదిలీలు, పదోన్నతులపై నిషేధం

Telangana election code ban on transfers and promotions

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ కోడ్ ప్రకారం, ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న అధికారులందరికీ బదిలీలు, పోస్టింగులు, పదోన్నతులపై పూర్తి నిషేధం. ఎన్నికలు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహిస్తారు. 31 జిల్లాల్లో శాంతిభద్రతలు, సన్నాహాలను సమీక్షించిన ఎన్నికల సంఘం, పోలింగ్ శాంతియుతంగా జరగాలని సూచించింది. ఇద్దరు మించి పిల్లలు ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులని … Read more

Guinness Record: సరూర్‌నగర్‌లో 1354 మంది మహిళలతో మెగా బతుకమ్మ

hyderabad bathukamma Guinness Record

Saroornagar bathukamma Guinness Record: సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన మెగా బతుకమ్మ గ్రాండ్ ఈవెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. రెండు రికార్డులు — ఒకటి: 11 అడుగుల వెడల్పు, 68 అడుగుల ఎత్తు, 7 వేల టన్నుల పూలతో ఏర్పాటు చేసిన అతిపెద్ద బతుకమ్మ. రెండోది: ఒకేసారి 1354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ నర్తించడం. ఈ ఘన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ … Read more

Bathukamma: తెలంగాణ మహిళల ఘన సంబరాలు

Bathukamma Celebrations 2025

చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ మహిళలు ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు ( Bathukamma Celebrations ) చేసుకుంటున్నారు. తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు పేర్చారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ పరిసరాలు వెలుగులీనుతున్నాయి. వందలాది మంది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ కలిసి నృత్యం చేస్తున్నారు. హనుమకొండ, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో కూడా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడుతున్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపడే ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా … Read more