తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఖరారు.. స్కూల్స్, కాలేజీలకు ఎన్ని రోజుాలంటే?

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2026 సంక్రాంతి సెలవుల షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. తిరిగి జనవరి 17న స్కూల్స్ పునఃప్రారంభం అవుతాయి. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి 11 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించారు. అయితే, డిగ్రీ విద్యార్థులకు (ఓయూ పరిధిలో) మాత్రం కేవలం జనవరి 14, 15 తేదీల్లోనే … Read more

17 మంది లొంగిపోతే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రమే: డీజీపీ

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన మరో 17 మంది మావోయిస్టులు లొంగిపోతే తెలంగాణ ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’గా నిలుస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు కేవలం 17 మందే మిగిలి ఉన్నారని ఆయన వెల్లడించారు. వీరి వివరాలను వెల్లడిస్తూ.. కేంద్ర కమిటీలో నలుగురు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్ గ్రౌండ్‌లో ఇద్దరు ఉన్నారని, ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారని డీజీపీ వివరించారు. … Read more

నిమ్స్‌లో 813 పోస్టులు.. 73 కొత్త డయాలసిస్ కేంద్రాలు: మంత్రి దామోదర

నిమ్స్‌లో 813 ఉద్యోగాలు.. కొత్తగా 73 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి దామోదర కీలక ప్రకటన మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన, నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 73 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఇప్పటికే పనిచేస్తున్న 105 కేంద్రాలకు ఇవి అదనమని, ప్రతి 25 కిలోమీటర్ల … Read more

కోనసీమలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు, 3 గ్రామాలు ఖాళీ!

మన పత్రిక వెబ్​డెస్క్, కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ (ONGC) డ్రిల్లింగ్ సైట్ వద్ద గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగాయి. డీప్ ఇండస్ట్రీస్ సంస్థ నిర్వహిస్తున్న బావిలో తవ్వకాలు జరుపుతుండగా ఒక్కసారిగా గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట తెల్లటి పొగమంచులా వాయువు వ్యాపించగా, సమీపంలోని విద్యుత్ లైన్లు, ఆపరేటింగ్ ఇంజిన్ల నుంచి వచ్చిన నిప్పురవ్వల … Read more

కాంగ్రెస్ లో ముదిరిన వర్గ పోరు.. ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఫైర్

మన పత్రిక వెబ్​డెస్క్, జగిత్యాల: జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కొత్తగా చేరిన వారు పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలిపితే స్వాగతిస్తామని, అంతేకానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో, టికెట్ల పంపకాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని … Read more

Women’s canteens | మహిళా క్యాంటీన్లు.. మంత్రి సీతక్కకు విప్ బీర్ల ఐలయ్య విజ్ఞప్తి

మన పత్రిక వెబ్​డెస్క్, యాదాద్రి: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్టలో మహిళా క్యాంటీన్లను (Women’s Canteens) ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. అసెంబ్లీ వేదికగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. నిత్యం వేలాదిగా వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా, గుట్ట పరిసరాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే స్థానిక మహిళలు ఆర్థికంగా బలపడతారని, వారికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో … Read more

మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. నేడు, రేపు ఆల్ పార్టీ మీటింగ్స్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నేడు, రేపు రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో అఖిలపక్ష సమావేశాలు (All Party Meetings) నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి. రేపు (మంగళవారం) జిల్లా కలెక్టరేట్ల పరిధిలోనూ ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీల్లో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లపై రాజకీయ … Read more

ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు! మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని, ఈ కేసులో తదుపరి విచారణ అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ … Read more

పాముతో పోలీసులకు చుక్కలు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆటో డ్రైవర్ హల్​చల్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ ఆటో డ్రైవర్ వింతగా ప్రవర్తించాడు. తన ఆటోను సీజ్ చేయొద్దంటూ ఏకంగా పామును బయటకు తీసి పోలీసులనే భయపెట్టాడు. ఈ ఘటన శనివారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. సయ్యద్ ఇర్ఫాన్ అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో (110 పాయింట్లు) పట్టుబడ్డాడు. పోలీసులు ఆటోను సీజ్ చేయబోగా, వెంట తెచ్చుకున్న పామును చూపిస్తూ ట్రాఫిక్ ఎస్సైని బెదిరించాడు. ఆటో ఇస్తారా? లేక పామును … Read more

బాడీగార్డ్ పై సీఎం రేవంత్ చేయి చేసుకున్నారా? వైరల్ అవుతున్న వీడియో!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం దంపతులు గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో, జనం ఒక్కసారిగా ముందుకు రావడంతో సీఎం తన భద్రతా సిబ్బంది (బాడీగార్డ్)పై చేయి చేసుకున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు, గోపూజ సమయంలో సీఎం షూలు ధరించి ప్రదక్షిణలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులైన సెక్యూరిటీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదని, … Read more