గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణి సస్పెండ్..

నల్గొండ జిల్లా దేవరకొండ ( Devarakonda) ఎస్టీ బాలికల గురుకుల (ST Gurukula) పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. పదవ తరగతి విద్యార్థిని మాధవి ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో ప్రిన్సిపల్ కళ్యాణిని ఆదివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినిపై ప్రిన్సిపల్ కళ్యాణి, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, అమృతలు వేధింపులు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తల్లి కళ మీడియా ఎదుట వాపోయింది. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్, … Read more

Lok Adalat: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

Lok Adalat nizamabad november 15

మన పత్రిక, వెబ్​డెస్క్: జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి జడ్జి భరతలక్ష్మి (GVN Bharathalakshmi) విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 1,328 క్రిమినల్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జడ్జి భరతలక్ష్మి మాట్లాడుతూ, విభేదాలు వచ్చినప్పుడు రాజీ పద్ధతిలో ముందుకు రావడమే … Read more

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?

Telangana highcourt questions govt over local body elections

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 24 లోపు ఎన్నికల తేదీని ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 243 ఈ ఆర్టికల్ ప్రకారం పంచాయతీల కాల పరిమితి పూర్తయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రమే అభ్యంతరం తెలిపామని, ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు … Read more

Bus Accidents : నిన్న చేవెళ్ల.. ఇవాళ నల్గొండ, కరీంనగర్‌లో బస్సుల ప్రమాదాలు

two bus accidents in Nalgonda and karimnagar

Bus Accidents : చేవెళ్లలో నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ ను మరవక ముందే తెలంగాణలో మరో రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి దగ్గర ఇవాళ ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను మెట్ పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు … Read more

Chevella Accident : రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

mallu ravi response on chevella bus accident

Chevella Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా? ఎందుకు దానికి ఇంత రాద్దాంతం చేస్తున్నారు అంటూ స్పష్టం చేశారు. రెగ్యులర్ గా జరిగిన యాక్సిడెంట్ మాత్రమే ఇది. రోడ్డు బాగాలేక జరిగింది కాదు.. గత ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు జరగలేదా? రోడ్డు బాగున్న హైవేల మీద యాక్సిడెంట్స్ జరగడం లేదా అని మల్లు రవి ప్రశ్నించారు. చేవెళ్ల యాక్సిడెంట్ … Read more

chevella: 21 మంది మృతి.. 3 నెలల చిన్నారి సహా!

chevella news

మన పత్రిక, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో 21 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మృతుల్లో మూడు నెలల చిన్నారి పాప, ఆమె తల్లి కూడా ఉండటం తీవ్రంగా కలిచివేసింది. రోడ్డు పక్కన తల్లి, బిడ్డ మృతదేహాలు ఉన్న దృశ్యం అక్కడివారిని కంటతడి పెట్టించింది. ఇదే ప్రమాదంలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు … Read more

పాఠశాలలకు 3 రకాల నిధులు విడుదల.. లిస్ట్ ఇదే!

3 interventions grants released school wise list of Rajanna Siricilla

మన పత్రిక, వెబ్​డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మూడు రకాల గ్రాంట్లను విడుదల చేస్తూ పాఠశాలల వారీగా జాబితాను విడుదల చేశారు. ఈ నిధులలో ‘కాంపోజిట్ స్కూల్ గ్రాంట్’, ‘GCEC గ్రాంట్స్’, మరియు ‘ఫార్మేషన్ ఆఫ్ హౌస్ సిస్టమ్’ (పాఠశాలల్లో హౌస్ సిస్టమ్ ఏర్పాటు) గ్రాంట్లు ఉన్నాయి. జిల్లాలోని బోయినపల్లి, చందుర్తి, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల సహా పలు మండలాల్లోని పాఠశాలలను ఈ … Read more

Chevella: ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి! తాండూరులో విషాదం.

chevella 3 sisters die

మన పత్రిక, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం (Bus accident in chevella) మీర్జాగూడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయి ప్రియ (డిగ్రీ ఫైనల్ ఇయర్), తనుషా (ఎంబీఏ)గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇటీవల బంధువుల … Read more

Chevella Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదంలో 17 మంది మృతి

17 members died in chevella bus accident

Chevella Bus Accident : ఇవాళ ఉదయం చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మండలంలోని మీర్జాగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సింగిల్ రోడ్ కావడం, డివైడర్ లేకపోవడంతో పాటు మలుపు వద్ద ఓవర్ స్పీడ్ తో ఉన్న కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ బస్సును బలంగా ఢీకొనడంతో బస్సు తుక్కుతుక్కు అయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఉదయం 4.30 కు … Read more

RTC Bus Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. బస్సులో 70 మంది

rtc bus and lorry accident at chevella

RTC Bus Accident : ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, రూల్స్ పాటించాలని నెత్తినోరు మొత్తుకున్నా రోడ్డు ప్రమాదాలు జరగడం మాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును, కంకర లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో … Read more