Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 24 లోపు ఎన్నికల తేదీని ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 243 ఈ ఆర్టికల్ ప్రకారం పంచాయతీల కాల పరిమితి పూర్తయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రమే అభ్యంతరం తెలిపామని, ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు తెలిపింది. దీంతో బీసీ రిజర్వేషన్ గ్రామాలను పక్కన పెట్టి మిగితా గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ఎన్నికల కమిషన్ స్పష్టం చేయగా, అలా విభజించి ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్ కాదని హైకోర్టు మండిపడింది. ఈనెల 24 వ తేదీ లోపు ఎన్నికల తేదీని ప్రకటించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
