మన పత్రిక, వెబ్‌డెస్క్: జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో (CP Sai Chaitanya) కలిసి జడ్జి భరతలక్ష్మి (GVN Bharathalakshmi) విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 1,328 క్రిమినల్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
జడ్జి భరతలక్ష్మి మాట్లాడుతూ, విభేదాలు వచ్చినప్పుడు రాజీ పద్ధతిలో ముందుకు రావడమే ఉత్తమమని, ప్రజలు లోక్ అదాలత్ వైపు మళ్ళాలని సూచించారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ కోర్టు ప్రాంగణాల్లో ఈ ప్రత్యేక అదాలత్‌లు జరగనున్నాయని వివరించారు. న్యాయసేవల చట్టం ప్రకారం, వివాదాల త్వరిత పరిష్కారానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరమని ఆమె అన్నారు.
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి పోలీస్ శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. చిన్నచిన్న క్రిమినల్ కేసులు, క్షణికావేశంలో జరిగిన వివాదాలను ఈ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని పౌరులను ఆయన అభ్యర్థించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
