జర్నలిస్టులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సూపర్ స్పెషాలిటీ సేవలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈజేహెచ్‌ఎస్ (EJHS) వెల్‌నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. వెల్‌నెస్ సెంటర్లలో కేవలం ప్రాథమిక వైద్యమే కాకుండా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తేవాలన్నారు. ఇందులో భాగంగా … Read more

పంచాయతీ ఫలితాలే మా పాలనకు గీటురాయి.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్

మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రంలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం 12,702 పంచాయతీలకు గాను 7,527 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా గెలవగా, మరో 808 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారని వివరించారు. మొత్తంగా 66 శాతం ఫలితాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్, బీజేపీ కూటమి కేవలం 33 శాతం (బీఆర్ఎస్ 3,511, బీజేపీ 710) స్థానాలకే పరిమితమయ్యాయని … Read more

ఉపాధి హామీ పేరు మార్పుపై హరీష్ రావు ఫైర్.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే!

మన పత్రిక, వెబ్​డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును తొలగించి, ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’గా మార్చాలనుకోవడం అత్యంత ఆక్షేపణీయం అని మండిపడ్డారు. ఇది కేవలం పేరు మార్పు కాదని, దేశ సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని ‘ఎక్స్’ (Twitter) వేదికగా ధ్వజమెత్తారు. హరీష్ … Read more

స్కూల్ టైమింగ్స్ చేంజ్.. కలెక్టర్ ఆదేశాలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని ఉత్తర జిల్లాలను చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీలకు పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. ఉదయం వేళల్లో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి గురువారం పాఠశాలల వేళలను మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ అనే తేడా లేకుండా జిల్లాలోని అన్ని ప్రాథమిక, … Read more

GHMC ఉద్యోగులకు జాక్‌పాట్.. విలీన ప్రాంతాల్లో 24% HRA అమలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనమైన చుట్టుపక్కల మున్సిపాలిటీలు, ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే 24% ఇంటి అద్దె భత్యం (HRA) అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వం శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రాంతాల్లోని ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు వర్తింపజేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (TGOs) ప్రభుత్వాన్ని … Read more

నేడే ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు | Telangana Speaker Gaddam Prasad

మన పత్రిక, వెబ్​డెస్క్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నేడు (బుధవారం) సాయంత్రం తీర్పు చెప్పబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో, వారిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, ఫిరాయింపుల వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని, ఈ నెల 18వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం వెల్లడించాలని … Read more

TG News: సర్పంచ్‌ల స్వీకారం వాయిదా.. డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్‌ల పదవీ బాధ్యతల స్వీకరణ (Appointment Day) తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా, దానిని డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కారణం ఇదే: డిసెంబర్ 20న మంచి ముహూర్తాలు లేకపోవడంతో, తేదీని మార్చాలని పలువురు ఎన్నికైన … Read more

తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 2,832 ఖాళీలు

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 2,832 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా సమాచారం. వీటిలో కేవలం 200 మంది మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా, మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. విభాగాల వారీగా చూస్తే.. అత్యధికంగా 2,569 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. అలాగే 62 ప్రిన్సిపల్ పోస్టులు, 110 ఫిజికల్ డైరెక్టర్, 91 … Read more

సర్పంచ్ అభ్యర్థిపై కారం పొడితో దాడి!

మన పత్రిక, వెబ్​డెస్క్: కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేళ కలకలం రేగింది. శంకరపట్నం మండలం మొలంగూర్‌లో సర్పంచ్ అభ్యర్థి కొమురయ్యపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం.. కొమురయ్యను గుర్తుపట్టకుండా ఉండేందుకు ముందుగా ఆయన కళ్లలో కారం పొడి చల్లి, ఆపై దాడికి తెగబడ్డారు. ఊహించని పరిణామంతో బాధితుడు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కొమురయ్య … Read more

మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి: రేపే బిగ్ మ్యాచ్, వివరాలివే

మన పత్రిక, వెబ్​డెస్క్: ఒకప్పుడు ఫుట్‌బాల్‌కు అడ్డాగా ఉన్న హైదరాబాద్‌లో మళ్లీ సాకర్ మానియా కనిపిస్తోంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ రాకతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు సాగనున్న మెస్సీ భారత పర్యటనలో భాగంగా, రేపు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. కోల్‌కతాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ ప్రమోటర్ శతద్రు దత్తా ఆధ్వర్యంలో ఈ ప్రైవేట్ టూర్ జరుగుతోంది. గతంలో పీలే, మారడోనా వంటి దిగ్గజాలను భారత్‌కు రప్పించిన … Read more