మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈజేహెచ్ఎస్ (EJHS) వెల్నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. వెల్నెస్ సెంటర్లలో కేవలం ప్రాథమిక వైద్యమే కాకుండా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తేవాలన్నారు. ఇందులో భాగంగా జనరల్ సర్జరీ, కార్డియాలజీ (గుండె), నెఫ్రాలజీ (మూత్రపిండాలు), పీడియాట్రిక్స్ (పిల్లలు), న్యూరాలజీ, డెర్మటాలజీ వంటి విభాగాలను ప్రారంభించాలని సూచించారు.
ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
