మన పత్రిక, వెబ్డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును తొలగించి, ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’గా మార్చాలనుకోవడం అత్యంత ఆక్షేపణీయం అని మండిపడ్డారు. ఇది కేవలం పేరు మార్పు కాదని, దేశ సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని ‘ఎక్స్’ (Twitter) వేదికగా ధ్వజమెత్తారు.
హరీష్ రావు లేవనెత్తిన ప్రధాన అంశాలు:
- ఆర్థిక భారం: పథకంలో 60:40 నిధుల నిష్పత్తిని తీసుకురావడం వల్ల రాష్ట్రాలపై పెను ఆర్థిక భారం పడుతుందని, ఇది పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడమేనని ఆరోపించారు.
- కాంగ్రెస్ పై విమర్శలు: ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మౌనాన్ని ఆయన తప్పుబట్టారు. బయట సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడే కాంగ్రెస్, పార్లమెంట్లో మాత్రం రాష్ట్రాలను బలహీనపరిచే బీజేపీ చర్యలకు లోపాయికారీగా మద్దతిస్తోందని ఎద్దేవా చేశారు. అధికార కేంద్రీకరణలో బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు.
గాంధీ పేరును యథావిధిగా కొనసాగించాలని, రాష్ట్రాల హక్కులను కాలరాయవద్దని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
