Advertisement

ర్యావరణ పరిరక్షణకు పెద్దపీట.. నాగబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన నాగబాబు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కుంకీ ఏనుగులకు స్వయంగా ఆహారం అందించి, వాటి పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంపొందించేందుకు స్పష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు.

Advertisement