Advertisement

సెప్టెంబరు 17 నుంచి ‘సేవా సంకల్ప అభియాన్’: ఏపీ బీజేపీ అధ్యక్షుడు

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వెల్లడించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు సాగుతాయని తెలిపారు.

గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ అందించిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు ‘ఆశీర్వాద దీపం’ వెలిగించాలని సూచించారు. నెల రోజుల పాటు స్వచ్ఛ భారత్, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement