Advertisement

అవకాశవాద రాజకీయం పెరిగిపోయింది: మాజీ మంత్రి కొండా సురేఖ

వరంగల్: పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, ఎప్పుడూ ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో నిర్వహించిన కార్యకర్తలు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను సాధారణ ఎంపీటీసీ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగానంటే కష్టకాలంలో వెన్నంటి నిలిచిన కార్యకర్తలదే ప్రధాన పాత్ర అని కొనియాడారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం క్షణం కూడా ఆలోచించకుండా మంత్రి పదవికి రాజీనామా చేశానని, ఆయన ఉన్నన్నాళ్లు తమను కంటికి రెప్పలా కాపాడారని గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ పిలిచి అవకాశం ఇస్తేనే వరంగల్ ఈస్ట్ బాధ్యతలు చేపట్టామని, అయితే పరకాలను వదిలివెళ్లడం తమ వైపే జరిగిన పొరపాటని ఆమె అంగీకరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లాంటి మాస్ లీడర్ అవసరమని మొదట కోరుకున్నది తానేనని సురేఖ పేర్కొన్నారు.

Advertisement
Advertisement