Railway Jobs: రాత పరీక్ష లేదు, 10th+ITI అర్హత

railway jobs

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1104 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అర్హతల విషయానికొస్తే, అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. అక్టోబర్ 16, 2025 నాటికి అభ్యర్థుల … Read more

Suryapet: గొర్రెల మందపై కుక్కల దాడి.. 10 గొర్రెలు మృతి!

Suryapet news

మన పత్రిక, వెబ్​డెస్క్: సూర్యాపేట జిల్లా ( Suryapet District ) అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు ఓ గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో పది గొర్రెలు మృతి చెందగా, మరో ఆరు తీవ్రంగా గాయపడ్డాయి. గ్రామానికి చెందిన పగిడి వీరయ్య అనే రైతు రాత్రి సమయంలో తన ఇంటి పరిసరాల్లో ఉంచిన మందపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన గొర్రెలు … Read more

2 నెలల తర్వాత రాహుల్.. కూటమిలో 11 చోట్ల పోటీ | Rahul Gandhi Bihar elections

Rahul Gandhi Bihar elections

మన పత్రిక, వెబ్​డెస్క్: రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) చివరిసారిగా సెప్టెంబర్ 1న ‘ఓటు అధికార యాత్ర’ ముగింపు రోజున బీహార్‌లో కనిపించారు. ఆ యాత్రతో కాంగ్రెస్ క్యాడర్‌లో వచ్చిన ఉత్సాహాన్ని ఆయన కొనసాగించలేదని, ఇప్పుడు కేవలం మొక్కుబడిగా ప్రచారానికి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నవంబర్ 6న తొలిదశ పోలింగ్ జరగనుండగా, నవంబర్ 4 సాయంత్రానికే ప్రచారం ముగియనుంది. తేజస్వి యాదవ్ అధ్వర్యంలో ఎన్నికలు జరగడంపై రాహుల్ గాంధీకి అసంతృప్తి (లుకలుకలు) ఉండటం వల్లే … Read more

8th Pay Commission |  కేబినెట్ ఆమోదం! 50 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి.

8th Pay Commission

మన పత్రిక, వెబ్​డెస్క్: ఈ కేబినెట్ నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 8వ వేతన కమిషన్ తన సిఫార్సులను 18 నెలల్లోపు ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ నూతన సిఫార్సులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కేంద్రం తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఈ … Read more

Bihar Elections : బీహార్ ఎన్నికలు.. మహాఘట్ బంధన్ మేనిఫెస్టో రిలీజ్

mahagathbandhan releases manifesto in bihar

Bihar Elections : బీహార్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని మిగితా అన్ని పార్టీలు ఏకమైన విషయం తెలిసిందే. మహాకూటమిగా ఏర్పడి ఎన్డీఏపై పోరాటం చేస్తున్నాయి. మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మహాకూటమి నేతలు బీహార్ కా తేజస్వి ప్రాణ్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. బీహార్ లోని పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో … Read more

Bus Fire Accident : కర్నూలు ఘటన మరవకముందే మరో దారుణం

private sleeper bus fire accident on Jaipur delhi highway

Bus Fire Accident : కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదం ఘటనను మరవకముందే మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. రాజస్థాన్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ స్లీపర్ బస్సు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. జైపూర్, ఢిల్లీ హైవేలో బస్సు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. హైవే నుంచి సర్వీస్ రోడ్ లోకి వెళ్లిన బస్సు పైన హైటెన్షన్ కరెంట్ వైర్లు తగలడంతో … Read more

Cyclone Montha : మొంథా తుఫాను ఎఫెక్ట్.. ఆ రైళ్లన్నీ రద్దు చేసిన రైల్వే శాఖ

trains cancelled in ap due to cyclone montha

Cyclone Montha : ప్రస్తుతం మొంథా తుఫాను వల్ల ఏపీ మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ తుఫాన్ ధాటికి కోస్తా తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెళ్లే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. దాదాపుగా 107 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు మూడు రోజులు రైళ్లను క్యాన్సిల్ చేశారు. పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఏ రైళ్లు రద్దయ్యాయో వాటి … Read more

Harish Rao : హరీశ్ రావు తండ్రి అంత్యక్రియలు పూర్తి

harish rao father final rites completed

Harish Rao : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. సత్యనారాయణ అంత్యక్రియలకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ అభిమానులు హాజరయ్యారు.

Montha Cyclone : మొంథా తుఫాన్.. ఉప్పాడ స్థానికులను తరలించిన ప్రభుత్వం

uppada residents shifted to rehabilitation centre due to montha cyclone

Montha Cyclone : ప్రస్తుతం ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను మొంథా తుఫాన్ ముంచెత్తుతోంది. ఈ తుఫాన్ ధాటికి ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ భారీగా గాలులు వీయడంతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాన్ ధాటికి కాకినాడ జిల్లా భారీగా దెబ్బతిన్నది. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ స్థానికులను పునరావాస కేంద్రాలకు ఏపీ ప్రభుత్వం తరలించింది. మొంథా తుఫాన్ వల్ల ఉప్పాడలో భారీ వర్షాలతో పాటు భారీగా … Read more

Mass Jathara Trailer : ఇది కదా కావాల్సింది.. రవితేజ మార్క్ ఎలిమెంట్స్‌తో మాస్ జాతర ట్రైలర్

raviteja mass jathara telugu trailer released

Mass Jathara Trailer : రవితేజ అంటేనే ఒక ఎనర్జీ. ఆయన్ను సినిమాలో చూస్తున్నంతసేపు ఆడియెన్స్ కూడా ఎనర్జీ ఫీల్ అవుతారు. సినిమా మొత్తం ఆయన ఎనర్జీ లేవల్స్ పీక్స్ లో ఉంటాయి. అందుకే రవితేజ సినిమా అంటేనే మాస్, క్లాస్ అన్నీ కలిపి ఉంటాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మూవీ మాస్ జాతర. ఈ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్, లిరికల్ సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. … Read more