మన పత్రిక వెబ్‌డెస్క్, కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ (ONGC) డ్రిల్లింగ్ సైట్ వద్ద గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగాయి. డీప్ ఇండస్ట్రీస్ సంస్థ నిర్వహిస్తున్న బావిలో తవ్వకాలు జరుపుతుండగా ఒక్కసారిగా గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట తెల్లటి పొగమంచులా వాయువు వ్యాపించగా, సమీపంలోని విద్యుత్ లైన్లు, ఆపరేటింగ్ ఇంజిన్ల నుంచి వచ్చిన నిప్పురవ్వల కారణంగా మంటలు అంటుకున్నాయి. దీంతో పచ్చని కొబ్బరి చెట్లు సైతం దగ్ధమయ్యాయి.
మంటలు, దట్టమైన పొగ చుట్టుముట్టడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాలా, ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఇరుసుమండ సహా చుట్టుపక్కల మూడు గ్రామాలను ఖాళీ చేయించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రాజమండ్రి నుంచి ఓఎన్జీసీ సీనియర్ అధికారులు కూడా రంగంలోకి దిగారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌లతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
