మన పత్రిక వెబ్‌డెస్క్, పుణె: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ కల్మాడి (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పుణెలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. పుణె నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నికైన కల్మాడి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగానూ సేవలందించారు.
భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగా క్రీడా రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, దాదాపు 15 ఏళ్ల విచారణ అనంతరం ఇటీవలే కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన పార్థివ దేహానికి ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు పుణెలోని వైకుంఠ్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
