Brahmamudi March 14 Episode: రాఖీ నుంచి ఇందును కాపాడిన రాజు.. ఆస్తి లెక్కల్లో రేఖ

మన పత్రిక: ప్రముఖ బుల్లితెర ధారావాహిక ‘బ్రహ్మముడి’ శనివారం (మార్చి 14) ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. పబ్‌లో ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వెళ్లిన ఇందును రాఖీ కుట్ర నుంచి రాజు అనుకోకుండా కాపాడాడు. ఇందును లోబరుచుకునేందుకు రాఖీ మత్తుమందు కలిపిన జ్యూస్ ఇవ్వబోతుండగా.. రాజు, అతని స్నేహితుడు లక్కీ డ్యాన్స్ చేస్తూ ఢీకొనడంతో ఆ గ్లాస్ కింద పడిపోతుంది. జ్యూస్ కిందపడటంతో రాఖీ రాజును నిలదీసే ప్రయత్నం చేయగా, రాజు అతడిని చెంపదెబ్బ కొడతాడు. అయితే, అసలు … Read more

Gold Rate Today – March 14, శనివారం బంగారం ధరలు!

మన పత్రిక, హైదరాబాద్: పసిడి కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ హైదరాబాద్ మార్కెట్లో గురువారం (మార్చి 14) బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. రెండు వారాల వ్యవధిలోనే తులం బంగారంపై ఏకంగా రూ. 10 వేలకు పైగా తగ్గడం గమనార్హం. ఉదయం 8 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,400 తగ్గి రూ. 1,47,300కి చేరింది. 24 క్యారెట్ల మేలిమి పసిడి రూ. 1,530 … Read more

UstaadBhagathSingh : “నా కల… ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నెరవేరింది”! – రాశీ ఖన్నా

Rashi khanna about pawan kalyans ustaad bhagath singh

కల టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా (Raashi Khanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. Oohalu Gusagusalade సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తన పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. అయితే ఇప్పుడు పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా, Harish Shankar దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ Ustaad Bhagat Singhలో రాశీ ఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. … Read more

Rajendraprasad : ఎం.జి.ఆర్ వివాదం: చివరికి సారీ చెప్పిన నట కిరీటి రాజేంద్రప్రసాద్!

MGR Controversy: "Natakiriti" Rajendra Prasad Finally Apologizes!

టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇటీవలి కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఓ సినిమా ఈవెంట్‌లో తమిళ లెజెండరీ నటుడు, మాజీ సీఎం M. G. Ramachandran (ఎం.జి.ఆర్) గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ దిగ్గజం Kantha Rao గారి కాలంలో ఎం.జి.ఆర్ పరిస్థితి గురించి రాజేంద్రప్రసాద్ చేసిన కొన్ని కామెంట్స్ కోలీవుడ్ అభిమానులను తీవ్రంగా బాధించాయి. సోషల్ మీడియాలో ఈ … Read more

మంత్రి ఉత్తమ్.. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు

మన పత్రిక, సూర్యాపేట: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌పై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు (డొమెస్టిక్) వినియోగించే గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వల పరిస్థితిపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), సివిల్ … Read more

నిజామాబాద్ గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా.. నలుగురు మృతి

మన పత్రిక, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రైవేట్ బస్సు మొత్తం 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు బయలుదేరింది. ప్రయాణంలో భాగంగా రాత్రి రెండు గంటల సమయంలో … Read more

Miryalaguda: మిర్యాలగూడలో అధికారుల దాడులు.. 6 గ్యాస్ సిలిండర్ల సీజ్

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పౌరసరఫరాల శాఖ (సివిల్ సప్లై) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం ముమ్మరంగా తనిఖీలు చేసింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న మంజీర బార్ అండ్ రెస్టారెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ సిలిండర్లను … Read more

Ninnu Kori March 13 Episode: విరాట్‌కు సర్‌ప్రైజ్.. రాజ్‌కు శ్రుతి షాక్

Ninnu Kori March 13 Episode

మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ ధారావాహిక ‘నిన్ను కోరి’ శుక్రవారం (మార్చి 13) ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆఫీసులో కస్టమర్లతో లావాదేవీలు నిర్వహించే సమయంలో రాజ్ ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను మార్చేసి శ్రుతి అతనికి షాక్ ఇచ్చింది. ఆ స్కానర్ పై తన బ్యాంక్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అతికించడంతో, రాజ్ ఖాతాలో డబ్బులు పడలేదు. ఈ విషయం తెలుసుకున్న రాజ్, సరోజా కంగారు పడ్డారు. ఖాతాలో డబ్బుల కోసం వారిద్దరూ శ్రుతి … Read more

Gunde Ninda Gudi Gantalu Today Episode:  సుమతి పెళ్లి ఓకే.. మనోజ్‌కు ఆఫర్

మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ బుల్లితెర ధారావాహిక ‘గుండె నిండా గుడి గంటలు’ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్వతి కూతురు సుమతి పెళ్లి చూపులు జరగ్గా, పెళ్లి తర్వాత కూడా తాను ఉద్యోగం చేస్తూ తల్లికి అండగా ఉంటానన్న షరతుపై ఆమె ఈ వివాహానికి అంగీకరించింది. అబ్బాయి తరపు వారు కూడా ఎలాంటి కట్నకానుకలు వద్దని స్పష్టం చేశారు. పెద్దల్లుడు బాలు తరహాలోనే తాను కూడా కుటుంబానికి అండగా ఉంటానని కొత్త … Read more

TG Digital Health Profile: సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్

మన పత్రిక, సంగారెడ్డి: రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ వ్యవస్థను తీసుకువస్తోంది. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రాజెక్టు అమలు, ముందస్తు ఏర్పాట్లు, సాంకేతిక సదుపాయాలపై ఆయన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ పైలట్ ప్రాజెక్టును … Read more