మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ ధారావాహిక ‘నిన్ను కోరి’ శుక్రవారం (మార్చి 13) ఎపిసోడ్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆఫీసులో కస్టమర్లతో లావాదేవీలు నిర్వహించే సమయంలో రాజ్ ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను మార్చేసి శ్రుతి అతనికి షాక్ ఇచ్చింది. ఆ స్కానర్ పై తన బ్యాంక్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అతికించడంతో, రాజ్ ఖాతాలో డబ్బులు పడలేదు. ఈ విషయం తెలుసుకున్న రాజ్, సరోజా కంగారు పడ్డారు. ఖాతాలో డబ్బుల కోసం వారిద్దరూ శ్రుతి ముందు తగ్గి మాట్లాడారు.
మరోవైపు ఇంట్లో తన భర్త విరాట్‌కు చంద్రకళ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. గదిలో తన చిన్ననాటి ఫోటోను చూసి విరాట్ ఎంతో మురిసిపోయాడు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఈ ఫోటోను తరచూ చూస్తే పుట్టబోయే బిడ్డకు అవే పోలికలు వస్తాయని చంద్రకళ తెలిపింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు కానీ, తల్లి అయిన చంద్రకళకు కనీసం బంగారు గొలుసు అయినా చేయించారా అని శ్యామల రఘురాంను ప్రశ్నించింది.
ఇంట్లో మాయ ఓ ఫ్లవర్ వాజ్‌ను కింద పడేయడంతో ఆ శబ్దానికి రఘురాం ఉలిక్కిపడి మరోసారి గతం మర్చిపోయాడు. మాయను గుర్తుపట్టకపోగా, ఆమెను దొంగగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నాడు. వెంటనే జగదీశ్వరి, చంద్రకళ అక్కడికి చేరుకుని రఘురాంకు గతం గుర్తుచేశారు. అనంతరం మాయకు క్షమాపణలు చెప్పిన జగదీశ్వరి ఆమెకు అసలు విషయం వివరించింది.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
