మన పత్రిక: ప్రముఖ బుల్లితెర ధారావాహిక ‘బ్రహ్మముడి’ శనివారం (మార్చి 14) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పబ్‌లో ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వెళ్లిన ఇందును రాఖీ కుట్ర నుంచి రాజు అనుకోకుండా కాపాడాడు. ఇందును లోబరుచుకునేందుకు రాఖీ మత్తుమందు కలిపిన జ్యూస్ ఇవ్వబోతుండగా.. రాజు, అతని స్నేహితుడు లక్కీ డ్యాన్స్ చేస్తూ ఢీకొనడంతో ఆ గ్లాస్ కింద పడిపోతుంది.
జ్యూస్ కిందపడటంతో రాఖీ రాజును నిలదీసే ప్రయత్నం చేయగా, రాజు అతడిని చెంపదెబ్బ కొడతాడు. అయితే, అసలు నిజం తెలియని ఇందు.. రాజును అపార్థం చేసుకుని మండిపడుతుంది. మరోవైపు, పబ్‌లో ఉన్న ఐశ్వర్యను తన మాటల గారడీతో ఆకట్టుకున్న రాజు, స్నేహితుడు లక్కీ విసిరిన ఛాలెంజ్‌లో గెలిచి ఆమె ఫోన్ నంబర్ సంపాదిస్తాడు. ఇది చూసి లక్కీ ఆశ్చర్యపోతాడు.
ఇటు ఇంట్లో రేఖ, భ్రమరాంబలు.. ఇందు ఆస్తి పత్రాలపై సంతకం చేశాక రాబోయే ఆస్తుల లెక్కలు వేసుకుంటూ ఉంటారు. తన తల్లి చావుకు కారణమైన ఇందు తల్లి కావ్యాపై ఉన్న కోపంతోనే, ఆ పగను ఇందుపై తీర్చుకోవాలని రేఖ భావిస్తుంది. అర్ధరాత్రి ఇందు ఇంట్లో ఉందో లేదో అని రేఖకు అనుమానం రాగా.. స్వాతి దుప్పటి కప్పుకుని పడుకుని ఇందులా భ్రమరాంబను నమ్మిస్తుంది. ఆమె ఇందునే అని భ్రమరాంబ వెళ్లిపోవడంతో అపర్ణ, స్వాతి ఊపిరి పీల్చుకుంటారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
