గణేష్ భక్తులకు TGSRTC గుడ్ న్యూస్

TG: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా ఈ సేవలు సాగనున్నాయి. జేబీఎస్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సులు ప్యాట్నీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ … Read more

చరణ్‌తో పెళ్లి సమయంలో విమర్శలు ఎదుర్కొన్నా: ఉపాసన

సినిమా: ప్రముఖ వ్యాపారవేత్త, రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన ఫిట్‌నెస్ ప్రయాణంలోని కష్టాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అమెరికాలో చదువుతున్న సమయంలో ఒత్తిడి కారణంగా ఎక్కువగా తినడం వల్ల 18 ఏళ్ల వయసులోనే 95 కిలోల బరువు పెరిగినట్లు తెలిపారు. ఓట్స్, హై ప్రొటీన్ ఆహారం తీసుకోవడం, రోజూ 10 వేల అడుగులు నడవడంతో బరువు తగ్గానని చెప్పారు. చరణ్‌తో వివాహం సమయంలోనూ “చరణ్‌కు ఆమె తగిన జోడీ కాదు, లావుగా ఉంది” … Read more

తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 16కు వాయిదా.. బుధవారం ‘ఎల్ నినో’పై చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి నేటి వరకు జరగాల్సిన సమావేశాలను ఒక రోజు పొడిగిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం జరిగే సభలో ‘ఎల్ నినో’ పరిస్థితులు, వర్షాభావాలను ఎలా ఎదుర్కోవాలి, రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. కాగా, శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ’22ఏ’ భూముల అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య … Read more

బిగ్‌బాస్-10.. డేంజర్‌ జోన్‌లో 11మంది కంటెస్టెంట్స్..?

‘దశావతారం’ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 10 మొదటి వారం నుంచే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆట ప్రారంభమైన వారం తిరగకముందే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారనే ప్రచారం అందరికీ షాకిచ్చింది. తాజాగా శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎప్పటిలాగే స్టైలిష్ లుక్‌లో వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌తో ముచ్చటించి అసలు ట్విస్ట్‌లు బయటపెట్టారు. ఎలిమినేట్ అయ్యారన్న చైత్ర, చరణ్ నిజానికి షో నుంచి వెళ్ళిపోలేదని, సీక్రెట్ రూమ్‌లో ఉన్నారంటూ హౌస్‌మేట్స్ … Read more

రూ.200 కోట్లు క్రాస్ చేసిన ‘హనుమాన్ అంశ్’

సినిమా: ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో అత్యంత సాధారణంగా తెరకెక్కిన ఈ చిత్రం, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమా రిలీజైన 36 రోజుల్లోనే ఏకంగా రూ.205.73 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటికే విదేశాల్లో విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకున్న … Read more

జొమాటో కస్టమర్లకు మరో షాక్!

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ రకాల ఛార్జీలతో జేబులు గుల్ల చేస్తున్న ఆ సంస్థ.. తాజాగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఎంచుకునే కస్టమర్లపై అదనంగా రూ.5 నుంచి రూ.20 వరకు వసూలు చేయడం మొదలుపెట్టింది. బిల్లు సమ్మరీలో ఈ ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ ప్రత్యేకంగా కనిపిస్తుండటం గమనార్హం. డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ఈ భారం ఉండదు కానీ, … Read more

శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల వివరాలు వెల్లడి

TTD: తిరుమల శ్రీవారి డిసెంబర్‌ నెల ఆర్జిత సేవల టికెట్ల ఆన్‌లైన్ విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానంప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవల ఎలక్ట్రానిక్‌ డిప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో ఎంపికైన భక్తులు 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము … Read more

‘స్పిరిట్’పై నిర్మాత ప్రణయ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TG CINEMA: రివ్యూలతో సినిమాల స్థాయిని ఎప్పటికీ తగ్గించలేరని నిర్మాత ప్రణయ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన నిర్మించిన ‘రోమాంచకం’ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. కొందరు కావాలనే విమర్శలు చేశారని ఆయన మండిపడ్డారు. ఒక ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడం వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుందని, రివ్యూల పేరుతో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. తాను నిర్మిస్తోన్న భారీ అప్‌కమింగ్ చిత్రం ‘స్పిరిట్’ గురించి ప్రస్తావిస్తూ.. వారికి నిజంగా అంత … Read more

బిగ్‌బాస్ ఎంట్రీపై సుప్రీతా క్లారిటీ.. తల్లి ఇష్టమే నాకెక్కువ

TG: టాలీవుడ్ నటి సురేఖావాణి కూతురు సుప్రీతా బిగ్‌బాస్ పదో సీజన్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై తాజాగా సుప్రీతా స్పందించి స్పష్టతనిచ్చారు. తనకు బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ, తల్లి సురేఖా వాణికి ఉన్న ఆందోళనల కారణంగా తాను ఈ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. హౌస్‌లో భావోద్వేగాలను తాను కంట్రోల్ చేసుకోగలనా లేదా అనే సందేహాలు తన తల్లికి … Read more

విజయనగరం: మరోసారి కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్సీ బొత్స

AP: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరోసారి బహిరంగంగా భావోద్వేగానికి గురయ్యారు. విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతుండగా ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. ఇటీవల ఆయన మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరిన పరిణామాల నేపథ్యంలోనే ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయగా.. సమావేశంలో ఈ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. నిన్న సోషల్ … Read more