Horoscope 28 Oct 2025 : 28 అక్టోబర్ 2025 మంగళవారం రాశి ఫలాలు

Today Horoscope : 28 అక్టోబర్ 2025, మంగళవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా శ్రమ ఎక్కువవుతుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు చాలా కష్టపడాలి. బంధుమిత్రులు సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ప్రయాణాలు చేస్తారు.            వృషభం : ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తవుతుంది. మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. బుద్ధిబలాన్ని … Read more

Wines Tenders: ఒకే వ్యక్తికి 5 షాపులు!

Wines Tenders

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా మద్యం టెండర్లలో ఓ వ్యక్తిని భారీ అదృష్టం వరించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో చర్లపల్లికి చెందిన మాడుగుల నగేష్ అనే వ్యక్తి ఐదు షాపుల కోసం టెండర్లు దాఖలు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లాటరీ (లక్కీ డ్రా)లో ఆయన అదృష్టం తలుపు తట్టింది. తాను దరఖాస్తు చేసిన ఐదు షాపులకు గాను, ఐదింటినీ నగేష్ దక్కించుకున్నారు. ఒకే వ్యక్తికి ఐదు షాపులు దక్కడంతో ఆయన … Read more

Jubilee Hills by poll | 170 మంది రౌడీషీటర్ల బైండోవర్!

Jubilee Hills by poll

మన పత్రిక, వెబ్​డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో, నియోజకవర్గ పరిధిలోని 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. వీరిలో అత్యధికంగా బోరబండ ఏరియా నుంచి 74 మంది ఉండటం గమనార్హం. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, పోలీసులు బైండోవర్ … Read more

TG News: భోజన విరామ సమయంలో నిరసన SGTU

sgtu yadadri protest

మన పత్రిక, వెబ్​డెస్క్: వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రములో ప్రాథమిక పాఠశాల మహిళా ప్రధానోపాధ్యాయురాలు పై పోలీసు కానిస్టేబుల్ దాడికి నిరసనగా ఈరోజు ప్రాథమిక పాఠశాల బట్టుగూడ గ్రామంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో SGTU YADADRI జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే కరుణ గారులు పాల్గొన్నారు

Wines Tenders: భార్యాభర్తలకు రెండు షాపులు!

suryapet liquor shop tender draw husband wife

మన పత్రిక, వెబ్​డెస్క్: సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మద్యం టెండర్ల డ్రాలో ఓ భార్యాభర్తలను అదృష్టం వరించింది. జిల్లాలోని 93 మద్యం దుకాణాలకు 2070 దరఖాస్తులు రాగా, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ డ్రా పద్ధతిలో దుకాణాలను ఎంపిక చేశారు. ఈ డ్రాలో వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్‌కు గెజిట్ నెంబర్ 21 షాపు దక్కింది. అదేవిధంగా, ఆయన భార్య శ్రావణికి గెజిట్ నెంబర్ 13 లో … Read more

Gold Rates 27 Oct 2025: 27 అక్టోబర్ 2025, సోమవారం ఈరోజు గోల్డ్ రేట్స్

Gold Rates 27 Oct 2025 telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: పసిడి ధర నిన్నటితో పోలిస్తే సోమవారం (అక్టోబర్ 27) భారీగా తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,620 పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,15,150 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 1,54,000కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు … Read more

TG News: హైదరాబాద్‌కు 2,000 బస్సులు కేటాయింపు!

hyderabad 2000 new electric buses

10,900 విద్యుత్ బస్సుల టెండర్.. హైదరాబాద్‌కు 2,000 బస్సులు! మన పత్రిక, వెబ్​డెస్క్: దేశవ్యాప్తంగా పలు నగరాల కోసం 10,900 విద్యుత్ బస్సులను సేకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ కన్వెర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) నవంబర్ 6న బిడ్లు ఓపెన్ చేయనుంది. సున్నా ఉద్గారాల ప్రజా రవాణాను ప్రోత్సహించే నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (NEBP) కింద ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ టెండర్ ద్వారా హైదరాబాద్‌తో పాటు సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు … Read more

స్నేహితుని మృతి: కుటుంబానికి రూ. లక్ష సాయం.

friends help

మన పత్రిక, వెబ్​డెస్క్: రాజేష్‌తో పాటు కలిసి చదువుకున్న “1994-95 పదవ తరగతి స్నేహబంధం టీం” మిత్రులందరూ కలిసి రూ. 1,04,500 (లక్ష నాలుగు వేల ఐదు వందల రూపాయలు) సేకరించారు. ఈ ఆర్థిక సహాయాన్ని వారు ఆదివారం రాజేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మొత్తాన్ని వారు నేరుగా చేతికి ఇవ్వకుండా, రాజేష్ కూతురు మౌన్యశ్రీ పేరు మీద పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం విశేషం. అనంతరం ఆ డిపాజిట్ పాస్‌బుక్‌ను రాజేష్ నివాసానికి … Read more

షాకింగ్.. 100 అయస్కాంతాలు మింగిన బాలుడు!

new zealand boy swallows 100 magnets

మన పత్రిక, వెబ్​డెస్క్: న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన 100 అయస్కాంతాలను మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఎక్స్‌రే తీశారు. సుమారు 80 నుంచి 100 అయస్కాంతాలు బాలుడి పేగుల్లో చిక్కుకుపోయి, దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఆ దేశంలో 2013 నుంచే ఇలాంటి ప్రమాదకర అయస్కాంతాలపై నిషేధం ఉంది. అయినప్పటికీ, ‘టెము’ (Temu) అనే ఆన్‌లైన్ కంపెనీ వాటిని విచ్చలవిడిగా అమ్ముతుండటంపై … Read more

Indiramma illu: శ్లాబ్ బిల్లు చెల్లింపులో మార్పులు!

tg indiramma housing scheme

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి నుండి, శ్లాబ్ నిర్మాణం పూర్తయిన తర్వాత గతంలో ప్రకటించినట్లు ₹2 లక్షలు కాకుండా, ₹1.40 లక్షలు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకాన్ని ఉపాధి హామీ (90 పనిదినాలు)తో అనుసంధానించడం, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడమే ఈ మార్పుకు కారణంగా తెలుస్తోంది. మిగిలిన ₹60 వేలను, ఇంటి నిర్మాణం పూర్తయిన … Read more