Today Horoscope : 28 అక్టోబర్ 2025, మంగళవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఏ పని ప్రారంభించినా శ్రమ ఎక్కువవుతుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు చాలా కష్టపడాలి. బంధుమిత్రులు సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ప్రయాణాలు చేస్తారు.
వృషభం : ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తవుతుంది. మీ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. బుద్ధిబలాన్ని ఉపయోగిస్తారు.
మిథునం : కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి విజయం వరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కావాల్సినంత డబ్బు అందుతుంది. ఏ పని ప్రారంభించినా మనోధైర్యంతో ముందుకెళ్తారు.
సింహం : ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. శుభవార్త వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు చేయడానికి సంకల్పిస్తారు.
తుల : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వాళ్ల అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం : ఏ పని ప్రారంభించినా పూర్తవదు. అది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకెళ్తారు.
మకరం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.
కుంభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొన్ని వ్యవహారాల్లో దూరకుండా ఉండకుండా ఉండండి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మీనం : కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
