Sreelekha Ips: మేయర్ రేసులో మాజీ డీజీపీ శ్రీలేఖ..

మన పత్రిక, వెబ్​డెస్క్: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. నిన్నటి వరకు ప్రియాంక గాంధీపై పోటీ చేసిన నవ్య హరిదాస్ గురించి చర్చించుకుంటే, నేడు మాజీ ఐపీఎస్ అధికారిణి శ్రీలేఖ విజయం హాట్ టాపిక్‌గా మారింది. 1987 బ్యాచ్‌కు చెందిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారి శ్రీలేఖ, డీజీపీ హోదాలో రిటైర్ అయిన అనంతరం బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలి హోదాలో ఉండి కూడా, పార్టీ ఆదేశాల … Read more

రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. 2026 జాబ్ కేలండర్ విడుదల!

మన పత్రిక, వెబ్​డెస్క్: రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షిక జాబ్ కేలండర్‌ను (Annual Job Calendar) శనివారం విడుదల చేసింది. దీని ప్రకారం ఏడాది పొడవునా వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. 2026 నోటిఫికేషన్ల షెడ్యూల్ ఇలా ఉంది: అభ్యర్థులు ఈ షెడ్యూల్ ఆధారంగా తమ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.

కార్పొరేటర్‌గా గెలుపు.. నవ్య హరిదాస్ ఆదర్శం.

మన పత్రిక, వెబ్​డెస్క్: కేరళ బీజేపీ నాయకురాలు నవ్య హరిదాస్ (Navya Haridas) రాజకీయ నిబద్ధత ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవలే వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. సాధారణంగా ఎంపీగా పోటీ చేసిన నాయకులు, ఆ స్థాయికి తగ్గ చిన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపరు. కానీ, నవ్య హరిదాస్ మాత్రం పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి భేషజాలకు పోకుండా … Read more

ఉపాధి హామీ పేరు మార్పు.. కేంద్రం నిర్ణయంపై ప్రియాంక గాంధీ ఫైర్!

మన పత్రిక, వెబ్​డెస్క్: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు మార్గాలు, అధికార భవనాల పేర్లు మార్చిన మోదీ సర్కార్.. తాజాగా పేదలకు అండగా ఉండే ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (MGNREGA) పేరును మారుస్తూ శుక్రవారం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకాన్ని ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన’గా పిలవనున్నారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం … Read more

పోలవరంపై సుప్రీం బాట.. చంద్రబాబు ప్రాజెక్టుపై రేవంత్ న్యాయ పోరాటం

మన పత్రిక, వెబ్​డెస్క్: గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పేరుతో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. గతంలో ప్రతిపాదించిన ‘బనకచర్ల’ ప్రాజెక్టును కేంద్ర జలసంఘం నిరాకరించడంతో, చంద్రబాబు వ్యూహం మార్చి రూ. 58,700 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటిని ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ కుడి కాలువ, బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా నల్లమలసాగర్‌కు మళ్లించాలన్నది ఈ పథకం ఉద్దేశం. అయితే, … Read more

మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి: రేపే బిగ్ మ్యాచ్, వివరాలివే

మన పత్రిక, వెబ్​డెస్క్: ఒకప్పుడు ఫుట్‌బాల్‌కు అడ్డాగా ఉన్న హైదరాబాద్‌లో మళ్లీ సాకర్ మానియా కనిపిస్తోంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ రాకతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు సాగనున్న మెస్సీ భారత పర్యటనలో భాగంగా, రేపు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. కోల్‌కతాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ ప్రమోటర్ శతద్రు దత్తా ఆధ్వర్యంలో ఈ ప్రైవేట్ టూర్ జరుగుతోంది. గతంలో పీలే, మారడోనా వంటి దిగ్గజాలను భారత్‌కు రప్పించిన … Read more

Akhanda 2: బాలయ్య శివతాండవం.. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్

మన పత్రిక, వెబ్​డెస్క్: ‘అఖండ’ విజయంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖండ 2’లో (Akhanda 2) బాలయ్య తనదైన శైలిలో నట విశ్వరూపం చూపించారు. సినిమా మొత్తం బాలయ్య ‘వన్ మ్యాన్ షో’ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అఖండ పాత్ర ప్రవేశించిన తర్వాత థియేటర్లలో పూనకాలు తెప్పించే రేంజ్‌లో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అఘోరా గెటప్‌లో బాలయ్య లుక్, నడవడిక, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు … Read more

తెలంగాణ బీజేపీలో కలకలం… ఎంపీల మధ్య సమన్వయ లోపంపై చర్చ.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచినప్పటికీ, వారి మధ్య సమన్వయం లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో పార్టీ తీరుపై క్యాడర్ అయోమయానికి గురైంది. అధిష్టానం రాష్ట్ర రాజకీయాలను అంచనా వేయడంలో, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విఫలమవుతోందనే వాదనలు ఉన్నాయి. ఎంపీల మధ్య సయోధ్య లేకపోవడం, ఇతర పార్టీలతో … Read more

TGSEB: టెన్త్, ఇంటర్ బోర్డుల విలీనం!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టే యోచనలో ఉంది. పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి, ఇకపై ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు’ పేరిట ఒకే బోర్డును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ‘తెలంగాణ రైజింగ్ విజన్’ డాక్యుమెంట్‌లో ఈ కీలక అంశాన్ని పొందుపరిచారు. దేశంలో ప్రస్తుతం కేవలం 6 రాష్ట్రాల్లోనే టెన్త్, ఇంటర్ లకు వేర్వేరు బోర్డులు ఉన్నాయని ఇటీవల కేంద్ర విద్యాశాఖ … Read more

లోయలో పడ్డ యాసిడ్ లారీ.. డ్రైవర్ మృతి.

మన పత్రిక, వెబ్​డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కాకినాడ నుంచి పాల్వంచకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న భారీ లారీ, పాములేరు వాగు బ్రిడ్జి వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అయితే లారీలో ప్రమాదకరమైన యాసిడ్ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర … Read more