మన పత్రిక, వెబ్‌డెస్క్: కేరళ బీజేపీ నాయకురాలు నవ్య హరిదాస్ (Navya Haridas) రాజకీయ నిబద్ధత ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవలే వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. సాధారణంగా ఎంపీగా పోటీ చేసిన నాయకులు, ఆ స్థాయికి తగ్గ చిన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపరు.
కానీ, నవ్య హరిదాస్ మాత్రం పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి భేషజాలకు పోకుండా కేరళలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. కోజికోడ్ (Kozhikode) కార్పొరేషన్‌లోని ‘కరప్పరంబు’ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీ అభ్యర్థి స్థాయి నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలవడం ఆమె నిబద్ధతకు నిదర్శనమని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పదవుల కోసం పట్టుబట్టే నాయకులకు నవ్య హరిదాస్ తీరు ఒక పాఠం లాంటిదని, ఆమెలో సుష్మా స్వరాజ్ స్థాయి కార్యదీక్ష కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
