Sriram Sagar | శ్రీరామ్‌సాగర్, నిజాంసాగర్ వరద తగ్గుముఖం
మెండోరాలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో (Sriram Sagar Project) ప్రస్తుతం 1,11,270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. గత ఆదివారం 37 గేట్లు ఎత్తిన అధికారులు, సోమవారం నుంచి 26 గేట్ల ద్వారా మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు). ప్రస్తుతం 1090.90 అడుగుల నీరు (80.05 టీఎంసీలు) నిల్వ ఉంది. వరద గేట్ల ద్వారా 1,01,480 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. … Read more