Pension Rules : ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత నెల నెలా జీతాలు రావు. అందుకే వాళ్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వాలు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాయి. నెలనెలా ఫించన్ రూపంలో వాళ్లకు ఆర్థిక భరోసాను ప్రభుత్వాలు అందిస్తాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల రూల్స్ లో కొన్ని తేడాలు ఉంటాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విషయంలో కేంద్రం ఇటీవల కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చింది.
కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు, 2021 సీసీఎస్ పెన్షన్ రూల్స్, 2021 ప్రకారం పెన్షన్ క్లెయిమ్ చేయాలంటే ఉద్యోగి రిటైర్ అయిన తేదీ అప్పుడు ఉన్న రూల్స్ నే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ రోజు ఉన్న రూల్స్ ప్రకారమే పెన్షన్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఒకవేళ ఆ ఉద్యోగి ఉద్యోగానికి రిజైన్ చేసినా, లేదా ఉద్యోగం నుంచి తొలగించినా, సర్వీస్ లో ఉండగా మరణించినా అప్పుడు ఉన్న రూల్స్ నే పరిగణనలోకి తీసుకుంటారు.
అలాగే.. ఉద్యోగి రిటైర్ అయిన రోజు, రాజీనామా చేసిన రోజు, సర్వీస్ లో ఉండగా మరణించిన రోజునే లాస్ట్ వర్కింగ్ డేగా నిర్ణయిస్తారు. ఇది సీసీఎస్ రూల్స్ 5, 2021 లో స్పష్టంగా ఉంది.
2023, సీసీఎస్ ఎక్స్‌ట్రార్డినరీ పెన్షన్ రూల్స్ ప్రకారం ఉద్యోగి సర్వీస్ లో ఉండగా చనిపోతే ఆ ఉద్యోగికి పెళ్లి కాకపోయినా, పెళ్లి అయినా భార్య, భర్త, పిల్లలు ఎవ్వరూ లేకపోతే అప్పుడు ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ప్రకారం ఆ ఉద్యోగి పెన్షన్.. తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు వాళ్లకే లభిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
