Train Accident : ఇప్పటికే బస్సుల ప్రమాదాలను చూసి అంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఓ రైలు ప్రమాదం మరోసారి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ప్యాసెంజర్ రైలు ప్రమాదానికి గురైంది. బిలాస్ పూర్ లో గూడ్స్ రైలును ప్యాసెంజర్ ట్రెయిన్ ఢీకొట్టిం. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వెంటనే సహాయక చర్యలను అధికారులు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
గెవారా రోడ్ నుంచి బిలాస్ పూర్ వెళ్తున్న మెము లోకల్ ప్యాసెంజర్ రైలు అది. ట్రెయిన్ నెంబర్ 68733 కాగా, గటోరా బిలాస్ పూర్ రైల్వే లైన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
